Kodali Nani : పశువుల కొట్టంలో పడుకున్న మాజీ మంత్రి కొడాలి నాని

పశువుల కొట్టంలో పడుకున్న మాజీ మంత్రి Kodali Nani ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kodali Nani : పశువుల కొట్టంలో పడుకున్న మాజీ మంత్రి కొడాలి నాని

Former Minister Kodali Nani

Updated On : April 18, 2022 / 1:15 PM IST

Kodali Nani : పదవి ఇస్తేనే జగన్ అన్న జై అనేవారు కొందరైతే..పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్ సైనికుడుగానే ఉండేవారు మరికొందరున్నారు. అటువంటివారిలో జగన్ కోసం తన వాయిస్ ను ఏమాత్రం మొహమాటం లేకుండా పలు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కొడాలి నాని. ప్రస్తుతం ఆయన మాజీ మంత్రిగా ఉండిపోయారు. మొదటి మంత్రి వర్గ విస్తరణంలో మంత్రి పదవి దక్కించుకున్న కొడాలి నాని రెండో విడతలో మంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అటువంటి కొడాలి నాని పశువుల కొట్టంలో పడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఒక పశువుల కొట్టంలో మంచంపై పడుకున్న కొడాలి నాని ఫొటోను నెటిజెన్లు వైరల్ చేస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో కొడాలి నానికి మళ్లీ స్థానం దక్కుతుందని చాలా మంది భావించారు. కానీ అంచనాలు తల్లక్రిందులయ్యాయి. అనిల్ కుమార్ యాదవ్ తో పాటు కొడాలి నానికి కూడా మంత్రి పదవి దక్కలేదు. పైగా చంద్రబాబుమీద మాటలతో విరుచుకుపడటంలో కొడాలి ముందుంటారు. అటువంటి వ్యక్తికి మరోసారి మంత్రి పదవి దక్కుతుందని అందరు భావించారు. కానీ జగన్ మాత్రం తనదైన శైలిలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టి అందరికి షాక్ ఇచ్చారు.

కానీ కొడాలిపై సీఎం జగన్ కు ఉన్న అభిమానంతో కేబినెట్ హోదా కలిగిన ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్టును ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, దానికి ఛైర్మన్ చేస్తానని జగన్ చెప్పారు. కానీ దాన్ని కొడాలి తిరస్కరించారు. మంత్రి పదవి పోయాక కొడాలి నాని పెద్దగా బయట కనిపించడం లేదు. ఇంటికే పరిమితమవుతున్నారు. ఆయన వ్యక్తిగత పనులు చూసుకుంటున్నట్లుగా తెలస్తోంది.

ఈ క్రమంలో సడెన్ గా కొడాలి పశువుల కొట్టంలో కనిపించారు. మంత్రి పదవి తనకు అవసరం లేదని, పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పిన ఆయన… అంత యాక్టివ్ గా కనిపించడం లేదని నెటిజెన్లు అంటున్నారు. ఈక్రమంలో కొడాలి నాని పశువుల కొట్టంలో పడుకుని ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.

కాగా జగన్ కు వీర విధేయుడిగనే కాకుండా.. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెంది.. వైసీపీలో ఉన్న కీలక నేత కొడాలి నాని ఒక్కరే.. ఆ లెక్కన చూసినా కొడాలికి మంత్రి పదవి ఇవ్వాలి.. కానీ జగన్ మనసులో ఎలాంటి లెక్కలు ఉన్నాయో ఏమో.. కొడాలి నాని కాదని.. అనూహ్యంగా క్రిష్ణా జిల్లా నుంచి జోగి రమేష్ కు మాత్రమే అవకాశం ఇచ్చారు. దీంతో మంత్రిగా ఉన్న కొడాలి నాని కాస్తా మాజీ మంత్రిగా మిగిలిపోయారు. దీంతో కొడాలి రిలాక్స్ గా పశువుల కొట్టంలో పడుకుని ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.