Andhra Pradesh: ఏపీలో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ.. ఏయే పోస్టులున్నాయో తెలుసా?
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. 597 పోస్టుల్లో 89 గ్రూప్-1 పోస్టులు, 508 గ్రూప్-2 పోస్టులు ఉన్నాయి.

Appsc Group 1 And 2
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీగా ఉన్న 597 పోస్టులను ఏపీపీఎస్సీ (APPSC ) ద్వారా భర్తీ చేయడానికి అనుమతిస్తూ ఏపీ ఆర్థికశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. 597 పోస్టుల్లో 89 గ్రూప్-1 పోస్టులు, 508 గ్రూప్-2 పోస్టులు ఉన్నాయి. త్వరలోనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్లు సహా డీఎస్పీ కేటగిరీ-II, అసిస్టెంట్ కమిషనర్ (ఎస్టీ) పోస్టులు కూడా ఉన్నాయి. గ్రూప్-2లో డిప్యూటీ తహసీల్దార్లు (గ్రేడ్ II) సహా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ ఎస్ఐ తదితర పోస్టులు ఉన్నాయి.
పూర్తి వివరాలు

APPSC

APPSC