Eluru: ఏలూరును రెండు మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం జీవో

ఏలూరులోని 21 గ్రామాల్లో 13 రూరల్ మండలం పరిధిలో, మిగతా ఎనిమిది గ్రామాలు ఏలూరు అర్బన్ మండల పరిధిలో కొనసాగుతాయి.

Eluru: ఏలూరును రెండు మండలాలుగా విభజిస్తూ ప్రభుత్వం జీవో

Eluru - Andhra Pradesh

Updated On : June 16, 2023 / 4:51 PM IST

Eluru – Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరును రెండు మండలాలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఏలూరు అర్బన్, ఏలూరు రూరల్ మండలాలుగా విభజించింది. ఏలూరు రూరల్ మండల కార్యాలయాన్ని చాటపర్రులో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 13 రెవెన్యూ గ్రామాలుగా విభజించి ఏలూరు రూరల్ మండలంగా గుర్తిస్తూ జీవో విడుదల చేశారు.

విభజన అనంతరం ఏలూరు రూరల్ మండలంలోని గ్రామాలు..
1. చాటపర్రు
2. జాలిపూడి
3. కట్లంపూడి
4. మాదేపల్లి
5. మల్కాపురం
6. మనూరు
7. శ్రీపర్రు
8. కలకుర్రు
9. కోమటిలంక
10. గుడివాకలంక
11. కొక్కిరాయిలంక
12. పైడిచింతపాడు
13. ప్రత్తికోళ్లలంక

ఏలూరులోని 21 గ్రామాల్లో ఈ పై 13 రూరల్ మండలం పరిధిలో, మిగతా ఎనిమిది గ్రామాలు ఏలూరు అర్బన్ మండల పరిధిలో కొనసాగుతాయి. అప్పట్లో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ఏలూరు ఉండేది. వైసీపీ ప్రభుత్వం చేసిన జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏలూరు జిల్లాగా ఏర్పడింది. ఇప్పుడు దాన్ని రెండు మండలాలుగా విభజించారు.

Haragopal: సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూస్తా: ప్రొఫెసర్ హరగోపాల్