Andhra pradesh : బోసుబొమ్మ సెంటర్ వద్ద తేల్చుకుందాం రండీ .. తిరువూరులో టెన్షన్ టెన్షన్

అభివృద్ధి చేసింది మేమా? మీరా? తేల్చుకుందాం రండీ అంటూ ఇరుపార్టీల నేతలు సవాళ్లు చేసుకున్నారు. బోసు బొమ్మ సెంటర్ వద్ద తేల్చుకుందాం అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్నారు.

Andhra pradesh : బోసుబొమ్మ సెంటర్ వద్ద తేల్చుకుందాం రండీ .. తిరువూరులో టెన్షన్ టెన్షన్

TDP and YCP Leaders challenges

Updated On : April 24, 2023 / 10:42 AM IST

Andhra pradesh : టీడీపీ, వైసీపీ నేతల సవాళ్లతో ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో పొలిటికల్ టెన్షన్ నెలకొంది. ఇరు తిరువూరులో అభివృద్ధి చేసింది మేమంటే మేము అని అభివృద్ధిచేసింది ఎవరో బోసు బొమ్మ సెంటర్ వద్ద తేల్చుకుందాం అంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకున్నారు. దీంతో బోసుబొమ్మ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇరు పార్టీల నేతల్ని ఇప్పటికే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

యువగళం పేరుతో టీడీపీ నేతల లోకేశ్ వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు, సెటైర్లు వేస్తున్నారు. సైకో సీఎం అంటూ జగన్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇలా టీడీపీ, వైసీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పొలిటికల్ టెన్షన్‌ పెరిగింది. సోమవారం (ఏప్రిల్ 24,2023) తిరువూరులో అభివృద్ది విషయంలో టీడీపీ, వైసీపీ నేతలు బహిరంగ సవాళ్లతో చర్చకు పిలుపునిచ్చుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమైయారు.

బోసు బొమ్మ సెంటర్ వద్ద భారీగా మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార, ప్రతి పక్ష పార్టీల మధ్య ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య ఘాటు విమర్శలు కొనసాగుతున్నాయి. ఇరుపార్టీ నేతల మధ్యా ఓ రేంజ్ లో మాటల తూటాలు పేలుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా బాహాబాహీకి దిగుతున్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో అభివృద్ధి పై వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధికి సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్.. దీనికి తిరువూరులో ఈరోజు అంటే సోమవారం బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. దీంతో మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసం మునియ్యను సహా పలువురుని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు తిరువూరు పోలీసులు.