Elections : ఏపీలో మరో ఎన్నిక.. డిసెంబర్ 14న పోలింగ్

తాజాగా మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగా వచ్చే నెలలో ఆర్టీసీలో క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) పాలక మండలి ఎన్నికలు జరగనున్నాయి.

Elections : ఏపీలో మరో ఎన్నిక.. డిసెంబర్ 14న పోలింగ్

Elections

Updated On : November 21, 2021 / 8:56 AM IST

Elections : ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. తాజాగా మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగా వచ్చే నెలలో ఆర్టీసీలో క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) పాలక మండలి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఆర్టీసీకి ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబర్ 14న ఈ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.

చదవండి : Municipal Elections : కొండపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్

ఈ ఎన్నికల్లో పోటీకి దిగిన ఎంప్లాయిస్‌ యూనియన్‌ (ఈయూ)కు ఏపీ పీటీడీ ఆఫీస్‌ స్టాఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ (ఓస్వా) మద్దతును ప్రకటించింది. రాష్ట్రంలోని 129 డిపోలు, యూనిట్లు, ఆఫీసు కార్యాలయాల్లో పనిచేసే పీటీడీ ఆఫీస్‌ స్టాఫ్‌ వెల్ఫేర్‌ అసోసియేన్‌ (ఓస్వా) సభ్యులు ఈయూకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

చదవండి : AP Municipal Results 2021 : మున్సిపాలిటీల్లో ఫ్యాన్ జోరు.. కుప్పంలో బాబు బేజారు- Live Updates