ఏపీలో రైతులకు బిగ్‌ అలర్ట్.. అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా వచ్చేసింది.. మీ పేరు లేకుంటే 13లోపు ఇలా చేయండి.. లేదంటే..

మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు వారి అర్హతను తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.

ఏపీలో రైతులకు బిగ్‌ అలర్ట్.. అన్నదాత సుఖీభవ అర్హుల జాబితా వచ్చేసింది.. మీ పేరు లేకుంటే 13లోపు ఇలా చేయండి.. లేదంటే..

AP Farmers

Updated On : July 9, 2025 / 8:33 AM IST

Annadata Sukhibhava: ఏపీ ప్రభుత్వం రైతులకు బిగ్ అప్డేట్ ఇచ్చింది. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం నిధులు మరో వారంరోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని సమాచారం. అయితే, తాజాగా.. అర్హుల జాబితాను రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. అన్నదాతలు రైతు సేవా కేంద్రాలకు వెళ్లి జాబితాలో మీరు ఉందా..? లేదా అనేది తనిఖీ చేసుకోవాలి. అలాకాకుంటే.. అన్నదాత సుఖీభవ పోర్టల్‌లోకి వెళ్లి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా కూడా అధికారులు విడుదల చేసిన జాబితాలో మీ పేరు ఉందా..? లేదా అనేది తెలుసుకోవచ్చు.

Also Read: Gossip Garage: పరిధి దాటిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాజకీయ విమర్శ.. మహిళ అని చూడకుండా అడ్డగోలు మాటలు

మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా రైతులు వారి అర్హతను తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మన మిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009కు రైతుల ఆధార్ కార్డు నెంబర్‌ను పంపిస్తే వెంటనే వివరాలు వెల్లడవుతాయి. జాబితాలో పేరు లేకుంటే.. పథకానికి అర్హులమని రైతులు భావిస్తే వెంటనే రైతు సేవా కేంద్రంలో అర్జీతోపాటు సంబంధిత పత్రాలను అందజేయాలి. అన్నదాత సుఖీభవ పోర్టల్ లోని గ్రీవెన్స్ మాడ్యులులో నమోదు చేసుకోవచ్చు. అయితే, ఈనెల 13వ తేదీ వరకు మాత్రమే ఇందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలుస్తోంది. అయితే, ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 47.77లక్షల రైతు కుటుంబాలను అర్హులుగా గుర్తించడం జరిగిందని, గ్రామ/వార్డు సచివాలయాల సర్వే ఆధారంగా 98శాతం మందికి ఈకేవైసీ పూర్తయిందని వ్యవసాయ సంచాలకులు ఢిల్లీరావు తెలిపారు. ఈ ప్రక్రియ ఇంకా 61వేల మందికి పూర్తి చేయాల్సి ఉందని అన్నారు.

కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయనున్నారు. భూమిలేని అన్నివర్గాల కౌలు రైతులు గుర్తింపు కార్డు పొందడంతోపాటు ఈ-పంటలో పేరు నమోదు చేసుకోవాలి. అర్హత ప్రకారం అందరికీ లబ్ధి చేకూరుస్తామని, ఈ యేడాది అక్టోబర్, 2026 జనవరి నెలల్లో రెండు విడతలుగా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ మొత్తాన్ని అందిస్తామని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు.