యనమలకో రూల్….ఇప్పుడో రూలా? శాసన సభ వ్యవహారాల్లో కోర్టుల జోక్యం వద్దు

ప్రతిపక్ష టీడీపీ తీరుపై ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన సభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని గతంలో యనమల రూలింగ్ ఇచ్చారని మరి ఇప్పుడెందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు శాసన సభ తీసుకునే నిర్ణయాలపై ఎందుకు కోర్టుకు వెళ్తున్నారని ప్రశ్నించారు.
శాసన సభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని 1997లో యనమల రూలింగ్ ఇచ్చారని గుర్తుచేశారు. మీరు సభాపతిగా ఉన్నప్పుడు మీకొక న్యాయం…ఈరోజు ఇంకొక న్యాయమా అని నిలదీశారు. దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారత రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానానికి వెళ్లే హక్కుంద్నారు. కానీ మీరిచ్చి రూలింగ్ కు సమాధానం చెప్పాలని యనమలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. రెండు నాలుకల ధోరణి ఎందుకని ప్రశ్నించారు.
శాసన సభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. పార్లమెంట్, శాసనసభలు తీసుకున్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఎంతోమంది నిపుణులు చర్చించి పాలన వికేంద్రీకరణ, సీర్డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.