మహిళల భద్రత చట్టానికి టీడీపీ సపోర్టు..బాబు సూచనలు

  • Published By: madhu ,Published On : December 9, 2019 / 08:56 AM IST
మహిళల భద్రత చట్టానికి టీడీపీ సపోర్టు..బాబు సూచనలు

Updated On : December 9, 2019 / 8:56 AM IST

మహిళల భద్రతపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. అత్యాచార ఘటనలపై ఓ చట్టాన్ని తీసుకరావాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సందర్భంగా సభలో చర్చ జరిగింది. దీనిపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడారు. భద్రతపై కఠినమైన చట్టం తీసుకరావాలని..ఇందుకు టీడీపీ సపోర్టు ఉంటుందని సభలో ప్రకటించారు బాబు. ఈ సందర్భంగా ఆయన చేసిన పలు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అభ్యంతరం చెప్పారు. కేవలం ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని స్పీకర్ సూచించారు. 

2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మహిళల భద్రత బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ…నిర్భయ ఘటన జరిగిన అనంతరం దేశంలోనే కాక..మారుమూల గ్రామాల్లో సైతం ఆందోళనలు జరిగాయన్న విషయాన్ని గుర్తు చేశారు. అమ్మాయిలను బయటకు పంపాలంటే..తల్లిదండ్రులు భయపడుతున్నారని తెలిపారు. నిర్భయకు నిధులు కేటాయించి..ఓ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశా ఘటన జరగడం అత్యంత దారుణమన్నారు. యూపీలో ఉన్నాన్ సంఘటను సభకు వివరించారు. అందరిలో ఒక ఆందోళన, బాధ, ఆవేశం వ్యక్తమయ్యాయన్నారు. ఒక చట్టాన్ని తీసుకొస్తామని ప్రభుత్వ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఇటీవలే ఏపీ రాష్ట్రంలో జరిగిన అత్యాచార ఘటనలను సభలో చదివి వినిపించారు బాబు. మహిళలపై వైసీపీ నేతలు అత్యాచారాలు జరపడం దారుణమన్నారు బాబు. దీనికి ప్రతిగా వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. 

బాబు సూచనలు : 
*
రాజకీయంగా పలుకుబడి ఉన్నా సరే..సమాజంలో చట్టాల్లో ఉండే లొసుగులను చూసుకునే ఏదో ఒక విధంగా ఆడపిల్లలను ఇబ్బంది పెట్టాలని అనుకొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 
* జాతీయ స్థాయిలో..ఇక్కడ ఉన్న ఉన్న చట్టాలను అధ్యయనం చేయాలి. 
* గతంలో జరిగిన సంఘటలను పొందుపర్చండి. 
* ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి. 
* తక్షణమే న్యాయం జరిగే విధంగా చూడాలి. 
* శిక్ష సత్వరమే పడితే..భయపడుతారు. 
* ప్రత్యేక మైన కోర్టు ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. 
* ఆడపిల్లలకు రక్షణ ఉండాల్సిందే. కఠినంగా వ్యవహరించే ప్రభుత్వం ఉండాలి..అందుకు ఒక కఠినమైన చట్టం ఉండాలి. 
Read More : ఆడవాళ్లను చంపుతుంటే మనస్సాక్షి లేదా : అన్నం తింటున్నారా… గడ్డి తింటున్నారా