Skill Development Scam : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్.. కీలక విషయాలు వెల్లడించిన ఏపీ సీఐడీ ఏడీజీ ఎన్.సంజయ్

కార్పొరేషన్ లో ఒకే వ్యక్తికి మూడు బాధ్యతలు అప్పగించారని వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తి అయిన గంటా సుబ్బారావుకు బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు.

Skill Development Scam : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్.. కీలక విషయాలు వెల్లడించిన ఏపీ సీఐడీ ఏడీజీ ఎన్.సంజయ్

AP CID ADG N.Sanjay

Updated On : September 14, 2023 / 12:17 AM IST

Skill Development Scam – AP CID ADG Sanjay : స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో స్కామ్ లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో స్కామ్ పై ఏపీ సీఐడీ ఏడీజీ ఎన్.సంజయ్ వివరణ ఇచ్చారు. ప్రొసీజర్స్ ను పక్కన పెట్టి స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పెట్టారని తెలిపారు. కేబినెట్ అనుమతి లేకుండానే కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ఆ కార్పోరేషన్ నుంచి షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించారని తెలిపారు.

కార్పొరేషన్ లో ఒకే వ్యక్తికి మూడు బాధ్యతలు అప్పగించారని వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తి అయిన గంటా సుబ్బారావుకు బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇవన్నీ జరగవు అని అన్నారు. అప్రూవల్ చేసిన వాటిలో 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయని తెలిపారు. అచ్చెన్నాయుడు 5 చోట్ల సంతకాలు చేశారని పేర్కొన్నారు.

Sidharth Luthra : రాజమండ్రి సెంట్రల్ జైలుకి సిద్ధార్ధ లూథ్రా, చంద్రబాబుతో ములాఖత్

అధికారులపై ఆనాడు ప్రభుత్వ పెద్ద ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపారు. సీఐడీ నోటీసుపై చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ రిప్లై ఇవ్వలేదన్నారు. అగ్రిమెంట్ లో రూ.330 కోట్ల ప్రాజెక్టు చేస్తున్నట్లు మాత్రమే ఉందన్నారు. రూ.311 కోట్ల లెక్కలు లేకుండానే షెల్ కంపెనీకి వెళ్లాయని తెలిపారు. రూ.241 కోట్ల స్కామ్ చేశారని వెల్లడించారు.

స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ లో స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో స్నేహ బ్లాక్ ను కేటాయించారు. ఈ కేసులో చంద్రబాబును ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు. గురువారం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ములాఖత్ కానున్నారు.

Chandrababu: చంద్రబాబుకు ఇండియా కూటమి ఆపన్న హస్తం.. సేఫ్ గేమ్ ఆడేందుకే సీబీఎన్ మొగ్గు!

చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో మరో షాక్ తగిలింది. జ్యూడీషియల్ రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలన్న చంద్రబాబు పిటిషన్ ను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. సీఐడీ వాదనతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో హౌస్ రిమాండ్ పిటిషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందా అని నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది.