Somu Veerraju : అక్కడ మోదీ డబ్బులు పంపితే ఇక్కడ జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు- సోమువీర్రాజు

Somu Veerraju : కేంద్రం ఇస్తున్న పథకాలకు జగన్ స్టికర్లు వేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్యం ఇస్తున్నట్లు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకుంటున్నారు.

Somu Veerraju : అక్కడ మోదీ డబ్బులు పంపితే ఇక్కడ జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారు- సోమువీర్రాజు

Somu Veerraju (Photo : Twitter, Google)

Updated On : June 28, 2023 / 11:24 PM IST

Somu Veerraju – YS Jagan Mohan Reddy : ఏపీ సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో పథకాలు అమలు చేస్తూ జగన్ గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ సమావేశానికి సోమువీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ముఖ్యమంత్రి జగన్ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. కేంద్రం 2 కోట్ల 26 లక్షల మందికి బియ్యం ఇస్తుంటే.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్యం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోందన్నారు. ఉపాధి హామీ డబ్బులు, డ్వాక్రా రుణాలకు డబ్బులు, పిల్లలకు మధ్యాహ్న భోజనం.. ఇవన్నీ ఇస్తున్నది కేంద్రమే అన్నారు సోమువీర్రాజు.

Also Read..Pawan Kalyan: సీఎం మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? నేను చెప్పును ఊరికే చూపించలేదు: పవన్ కల్యాణ్

” కేంద్రం ఇస్తున్న పథకాలకు జగన్ స్టికర్లు వేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్యం ఇస్తున్నట్లు అసెంబ్లీలో గొప్పలు చెప్పుకుంటున్నారు. జగన్ నవరత్నాలు మాత్రమే ఇస్తున్నారు. బీజేపీ రైతులకే 15 రత్నాలు ఇస్తుంది. మాట్లాడితే జగన్ బటన్ నొక్కుతున్నారు అని అనుకుంటున్నారు. మోదీ డబ్బులు పంపితే జగన్ ఇక్కడ బటన్ నిక్కొతున్నారు. ప్రజల సంక్షేమం కోసం వందే భారత్ స్పీడ్ తో పరుగు పెడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ఇద్దరి నాయకులకు నరేంద్ర మోడీ అంటే భయం. అందుకే ఢిల్లీ వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉంటారు” అని సోమువీర్రాజు అన్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై సోమువీర్రాజు ఫైర్..
ప్రజల్లోకి తప్పుడు ఆలోచనలు, ధోరణులు తీసుకెళ్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ కుటుంబం కోసం బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. కేసీఆర్ కూతురు, కొడుకు, అల్లుడు కోసం పార్టీ నడుపుతున్నారు. కేటీఆర్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. బీజేపీకి 303 సీట్లు వచ్చాయి. జరగబోయే ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ వస్తాయి.

Also Read..Chandrashekhar Azad: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కాల్పులు.. ఆసుపత్రికి తరలింపు