AP CM YS Jagan: మహిళా పక్షపాత ప్రభుత్వం మనది.. నాలుగేళ్లలో రూ.2.25లక్షల కోట్లు ఖర్చుచేశాం

మహిళల స్వాలంభన సాధికారత లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా రూ. 2,25,330.76 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేయడం జరిగిందని జగన్ చెప్పారు.

AP CM YS Jagan: మహిళా పక్షపాత ప్రభుత్వం మనది.. నాలుగేళ్లలో రూ.2.25లక్షల కోట్లు ఖర్చుచేశాం

CM Jagan

Updated On : March 25, 2023 / 2:05 PM IST

AP CM YS Jagan: మహిళల స్వాలంభన సాధికారత లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం (ycp government) పనిచేస్తుందని ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (CM Y.S. Jagan Mohan Reddy) అన్నారు. ఏలూరు జిల్లా (Eluru District) దెందులూరు నియోజకవర్గం‌ (Dendulur Constituency)లో మూడవ ఏడాది వైఎస్సార్‌ ఆసరా పథకం  (YSR Asara Scheme) ద్వారా నేరుగా డ్వాక్రా మహిళల (Dwakra womens) ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డబ్బులను జమ చేశారు. మూడవ విడతగా రూ. 6,419.89 కోట్ల ఆర్ధిక సాయాన్నిబటన్ నొక్కి ఖాతాల్లోకి సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది మహిళలకు లబ్ధిచేకూరుతుందని తెలిపారు. నేడు అందించిన 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్‌ ఆసరా క్రింద ఇప్పటివరకు ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు అయిందని సీఎం జగన్ అన్నారు.

CM YS Jagan: పిల్లలకు మంచి మేనమామలా.. గోరుముద్దలో రాగిజావను ప్రారంభించిన సీఎం జగన్..

ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు నాలుగు విడతలుగా డ్వాక్రా ఋణ మాఫీ చేస్తున్నామని తెలిపారు. మహిళల స్వాలంభన సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని జగన్ చెప్పారు. గత ప్రభుత్వం రుణాలు కట్టొద్దు, పొదుపు సంఘాల తరపున మేమే చెల్లిస్తామని 2014లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ ఆ హామీ నేర వేర్చలేదని జగన్ విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు రూ. 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఊరటనిస్తూ.. నాలుగు వాయిదాల్లో 25,571 కోట్ల రుణాన్ని తామే చెల్లిస్తామని మేనిఫెస్టోలో చెప్పామని, మాట ఇచ్చిన ప్రకారం నిలబెట్టుకుంటామని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ. 12,758 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామని అన్నారు.

CM YS Jagan: ఎందుకు తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి..? ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది మంచి మాత్రమే ..

గత ప్రభుత్వ మోసపూరిత విధానాల ద్వారా ఏ- గ్రేడ్‌‌లో ఉన్న సంఘాలు కూడా సీ, డీ గ్రేడ్‌లలోకి పడిపోయా యని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత.. మహిళల జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలని, వారి కుటుంబంలో సుస్ధిరమైన ఆదాయం రావాలని వైయస్ఆర్ ఆసరా పథకం తీసుకొచ్చి అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో మహిళలకు సుస్ధిరమైన ఆర్థిక అభివృద్ధికి బాటలు వేశామన్నారు. పుట్టిన బిడ్డ నుంచి, కాయకష్టం చేయలేని ముసలి వాళ్ళ వరకూ ప్రతీఒక్కరి అవసరాలను గుర్తించి తగు పథకాలు అమలుచేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

CM YS Jagan: మీ పిల్లల చదువు బాధ్యత నాదే.. తలరాతలు మార్చే శక్తి చదువుకే ఉంది.. జగన్న విద్యాదీవెన నిధులు విడుదల

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుండి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా రూ.2,25,330.76 కోట్లు అక్కాచెల్లెమ్మలకు అందజేయడం జరిగిందని జగన్ చెప్పారు. తొలుత దెందులూరు నియోజకవర్గం‌లో లిఫ్ట్ ఇరిగేషన్, నూజివీడు, దెందులూరు నియోజకవర్గం కలిపే బలివే బ్రిడ్జి నిర్మాణం, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు.