CM Jagan: ఇన్నాళ్లు చట్టం అందరికీ ఒక్కటే అని చెప్పేవాళ్లు లేరు.. చంద్రబాబు అరెస్టుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. పవన్ కల్యాణ్‌పై సెటైర్లు
కోర్టు అవినీతిపై చంద్రబాబుకు రిమాండ్ విధించినా ప్రశ్నిస్తా అన్నవాడు పశ్నించడు.. 371 కోట్లు ఎక్కడికి పోయాయి..? అందరూ కలిసి వాటా పంచుకుంటారు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

AP CM Jagan
CM YS Jagan Mohan Reddy : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అంశంపై ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వైఎస్ఆర్ కాపునేస్తం సభలో జగన్ మాట్లాడారు. అరెస్టయ్యి జైల్లో ఉన్న ఒక మహానుభావుడు గురించి నాలుగు మాటలు చెబుతాను, ఆలోచన చేయాలని ప్రజలను కోరుతున్నాను అని జగన్ అన్నారు. ఎన్ని దొంగ తనాలు, దోపిడీ చేసినా, వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని రక్షించుకొనేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠా సభ్యులు ప్రయత్నిస్తున్నారు. కానీ, చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవాళ్లు ఇంతకాలం లేరంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఒక మామూలు వ్యక్తి తప్పుచేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో.. అధికారంలోఉన్నవారికికూడా అదే శిక్ష పడాలని చెప్పేవారు ఇంతకాలం లేరని అన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంలో ఫేక్ అగ్రిమెంట్ సృష్టించి, నిబంధనలను తుంగలో తొక్కి.. 371 కోట్ల స్కాం సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు జీవితం మొత్తం దోపిడీని రాజకీయంగా మార్చుకున్నాడని జగన్ విమర్శించారు. చంద్రబాబును రక్షించుకోవడానికి పలుకుబడి కలిగిన దొంగల ముఠా తయారైందని, కానీ, చట్టం ఎవరికైనా ఒకటే అన్న నిజాన్ని వారు జీర్ణించుకోలేకపొతున్నారని జగన్ అన్నారు. లేని కంపెనీలు ఉన్నట్లుగా, దొంగ ఆగ్రిమెంట్లు సృష్టించి వందల కోట్లు దోపిడి చేశారని, కేంద్ర దర్యాప్తు సంస్దలే పేర్కొన్నాయని, స్కిల్ స్కాం సూత్రదారి పాత్రదారి అన్నీ చంద్రబాబేనని తేలిందని జగన్ అన్నారు. అన్ని ఆధారాలని CID చూపుతున్నా ఇంకా బొకాయిస్తున్నారంటూ జగన్ విమర్శించారు.
JanaSena: టీడీపీతో పొత్తు.. జనసేన ఎన్ని సీట్లు అడుగుతుంది.. ఎవరు ఎక్కడ నుంచి పోటీ?
కోర్టు అవినీతిపై బాబుకు రిమాండ్ విధించినా ప్రశ్నిస్తా అన్నవాడు పశ్నించడు.. 371 కోట్లు ఎక్కడికి పోయాయి..? అందరూ కలిసి వాటా పంచుకుంటారు అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ములాఖత్ పెరుతో మిలాఖత్ అయ్యారు. ప్రశ్నిస్తానంటూ ప్రగల్భాలు పలికిన వ్యక్తి చంద్రబాబుకు మద్దతు తెలపడాన్ని ప్రజలు అర్దం చేసుకోవాలి. జరగబోయే కురుక్షేత్ర యుద్దంలో న్యాయం, ధర్మం మనవైపు ఉన్నాయి. అన్యాయాలు, ఆక్రమాలు దొంగల ముఠావైపు ఉన్నాయి. దేవుడు దయ, ప్రజల ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నానని జగన్ అన్నారు. అనంతరం బటన్ నోక్కి 4వ విడత కాపు నేస్తం పథకంను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.