కార్తీకవనంలో కేపిటల్ సిటీ.. విశాఖలో రాజధాని ఎక్కడంటే? షార్ట్ లిస్టు రెడీ.. 

  • Published By: srihari ,Published On : June 22, 2020 / 01:32 PM IST
కార్తీకవనంలో కేపిటల్ సిటీ.. విశాఖలో రాజధాని ఎక్కడంటే? షార్ట్ లిస్టు రెడీ.. 

Updated On : June 22, 2020 / 1:32 PM IST

విశాఖలో రాజధాని ఎక్కడ ఉండబోతోంది. సీఎం క్యాంప్ ఆఫీసు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. షార్ట్ లిస్టులో ఏయే ప్రాంతాలు ఉన్నాయి. ఏపీకి కొత్త కేపిటల్ రాబోతోందా? కొత్తగా ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రాంతాలేంటి? విశాఖలో పాలన ప్రాంతంగా ఎంపిక చేస్తారనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశాఖను కార్య నిర్వాహక రాజధాని ప్రకటించినప్పటి నుంచి అధికారులు చాలా ప్రాంతాలను పరిశీలించినప్పటికీ కూడా తుది నిర్ణయాన్ని మాత్రం ప్రకటించలేదు. తాజాగా మరికొన్ని భవనాలను పరిశీలించి  ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌పై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఏపీ సీఎంఓ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్..  విశాఖ పర్యాటన ఆసక్తిగా మారింది. జిల్లా అధికారులతో కలిసి ఆయన బీమిలి బీచ్ రోడ్డులోని స్థలాలలను పరిశీలించారు. 

కాపులపాడులో గ్రే హౌండ్స్ కు కేటాయించిన స్థలాన్ని బౌద్ధరామంలో ఉన్న తోట్లకొండ, కార్తీకవనం వంటి ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సీఎం క్యాంప్ కార్యాలయం, రాజ్ భవన్, సచివాలయం విషయంలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయంలో రెండు ఆప్షన్లు పెట్టుకున్నట్టు సమాచారం.

అందులో ఒకటి ఆర్కే బీచ్ దగ్గరలోని విశాఖ పోర్ట్ అతిథి గృహాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలిస్తున్నారు. రెండోది.. రుషికొండ సమీపంలోని కార్తీక వనంలో నిర్మిస్తున్న హోటల్లో సీఎం క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేసుకుంటే బెటర్ అని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఆలోచనకు తగినట్టుగానే హోటల్ నిర్మాణ పనులు చకచకా సాగిపోతున్నాయి. డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

కార్తీక వనం అయితే సెక్యూరిటీ పరంగా బాగుంటుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. సిరిపురంలోని ప్రభుత్వ అతిధి గృహాన్ని రాజ్ భవన్‌గా ఉపయోగిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సమీపంలోని ఓ వాల్తేర్ క్లబ్ యజమాన్యంతో ఒప్పందం జరిగిందని, సగం భవనాన్ని గవర్నర్ బంగ్లాకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని సమాచారం.

వీలైనంత త్వరగా విశాఖకు క్యాపిటల్ తరలించాలని భావిస్తున్న ప్రభుత్వం.. దానికి తగినట్టుగా పావులు కదుపుతోంది. సీఎం క్యాంప్ ఆఫీసు, సచివాలయం, రాజ్ భవన్, మినిస్టర్స్ కోటస్, ఐఎఎస్, ఐపీఎస్ క్వార్టర్ల కోసం ఇప్పటికే పలు ప్రాంతాలను షార్ట్ లిస్టు చేసింది. కార్తీకవనంలో సీఎం క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం మెగ్గు చూపుతున్నట్టు సమాచారం.