Sajjala Ramakrishnareddy : చంద్రబాబు అజెండానే బీజేపీ అజెండా : సజ్జల

చంద్రబాబు అజెంబానే బీజేపీ అజెండా అని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ అనుబంధ విభాగంగా బీజేపీ మారిందని విమర్శించారు. మళ్లీ సీఎం అవుతాననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు.

Sajjala Ramakrishnareddy : చంద్రబాబు అజెండానే బీజేపీ అజెండా : సజ్జల

Sajjala

Updated On : December 29, 2021 / 6:41 PM IST

Sajjala Ramakrishnareddy satired BJP : బీజేపీ ప్రజాగ్రహ గభపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు అజెండా ప్రకారమే ఏపీలో బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు. టీడీపీ స్క్రిప్ట్ నే సోము వీర్రాజు చదివారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ పార్టీకి అనుగుణంగా జాతీయ పార్టీ పని చేస్తోందని టీడీపీ, బీజేపీ పార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

చంద్రబాబు అజెంబానే బీజేపీ అజెండా అని పేర్కొన్నారు. టీడీపీ అనుబంధ విభాగంగా బీజేపీ మారిందని విమర్శించారు. మళ్లీ సీఎం అవుతాననే భ్రమలో చంద్రబాబు ఉన్నారని సజ్జల తెలిపారు. చంద్రబాబు ఇప్పటి నుంచే పొత్తు రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Omicron AP : ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు

ఐదేళ్లలో రాజధాని కట్టడానికి ఎవరైనా అడ్డం వచ్చారా అని ప్రశ్నించారు. ఏపీ బీజేపీని చూస్తే పాపమనిపిస్తోందన్నారు. బీజేపీని చూస్తుంటే జాలి, బాధంగా ఉందన్నారు. బీజేపీ దిగజారుడు రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఎందుకు సొంత ఎజెండా పెట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.