Schools: స్కూళ్లలో ఇవి నిషేధం.. వారికి నో ఎంట్రీ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

విద్యార్థుల ఫోటోలు తీయొద్దంది. విద్యార్థులను, టీచర్లను బయటివారు కలవడానికి వీల్లేదని చెప్పింది.

Schools: స్కూళ్లలో ఇవి నిషేధం.. వారికి నో ఎంట్రీ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

Updated On : August 1, 2025 / 9:34 PM IST

Schools: ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో కొత్త రూల్స్ తెచ్చింది. ఇకపై స్కూల్స్ లో రాజకీయాలకు తావు లేకుండా చేసింది. స్కూళ్లలోకి బయటి వ్యక్తులు, రాజకీయ నాయకుల ప్రవేశంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అలాగే రాజకీయ పార్టీల పోస్టర్లు, గుర్తులు, బ్యానర్ల ప్రదర్శనపైనా నిషేధం విధించింది.

పాఠశాల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదని ఆదేశించింది. విద్యార్థులకు కానుకలు, స్కూళ్లకు విరాళాలు ఇవ్వాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని తేల్చి చెప్పింది. విద్యార్థుల ఫోటోలు తీయొద్దంది. విద్యార్థులను, టీచర్లను బయటివారు కలవడానికి వీల్లేదని చెప్పింది. ఫిర్యాదులు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది.