అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలివే

  • Published By: madhu ,Published On : January 20, 2020 / 09:11 AM IST
అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలివే

Updated On : January 20, 2020 / 9:11 AM IST

ఏపీ అసెంబ్లీ సాక్షిగా మంత్రి బోత్స సత్యనారాయణ అమరావతి రైతులకు పలు హామీలు ప్రకటించింది. ఏపీ రాజధాని అంశంలపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా మంత్రి బోత్స మాట్లాడుతూ…అమరావతి రాజధాని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సినవసరం లేదని, వారికి తమ ప్రభుత్వం మేలు చేస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. 

హామీలు : 
గత ప్రభుత్వం చేసిన బాండ్లు, అగ్రిమెంట్లు, ప్రతిమాట అమలు. 
గత ప్రభుత్వం ఇస్తున్న రూ. 2 వేల పెన్షన్ రూ. 5 వేలకు పెంపు.
అసైన్ లాండ్ రైతులకు 1000 గజాల నివాసస్థలం, 200 గజాల వాణిజ్య స్థలం.
పట్టా రైతులకు 1000 గజాలు, 250 గజాలు వాణిజ్య పంట.
జరీబు భూమలకు రూ. 50 వేలు, మట్టి భూములకు 30 వేలు.
ప్రతి సంవత్సరం జరీబు భూములకు రూ. 5 వేలు, మట్టి భూములకు రూ.  3 వేలు. దీని కాలపరిమతి 15 సంవత్సరాలకు పెంపు. 
భూములిచ్చిన రైతుల కౌలు రూ. 5 వేలకు పెంపు.
భూములిచ్చిన రైతులకు 15 ఏళ్ల వరకు కౌలు.
గత ప్రభుత్వం కంటే మెరుగైన ప్యాకేజీ.
పట్టా రైతులకు సమానంగా అసైన్డ్ రైతులకు వర్తింపు. 

ప్రాంతీయ అసమానతల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని, అన్ని ప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. బాబు ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందన్నారు. అభివృద్ధి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదని సూచించారు. ఏపీలో ఉన్న మూడు ప్రాంతాల అవసరాలను గమనించాలని, వనరులన్నీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకూడదన్నారు. అందుకే CRDAని రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. 14 వేల మంది రైతుల వద్ద బయట వ్యక్తులు భూములు కొన్నారని తెలిపారు. 
 

Read More : నన్నే డిక్టేట్ చేస్తారా : ఇన్ సైడర్ పై విచారణకు ఆదేశించే హక్కుంది – స్పీకర్