Minister Seediri Appalaraju: మావోయిస్టుల హెచ్చరికలు.. మంత్రి అప్పలరాజుకు భద్రత పెంచిన ఏపీ ప్రభుత్వం
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు ప్రభుత్వం భద్రత పెంచింది. మావోయిస్టులు లేఖ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సిఫార్సు మేరకు అదనంగా నలుగురు పోలీసులను కేటాయిస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ భద్రతాపరమైన చర్యలు తీసుకుంది.

Minister Seediri Appalaraju
Minister Seediri Appalaraju: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి సీదిరి అప్పలరాజుకు భద్రత పెంచింది. మావోయిస్టులు లేఖ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సిఫార్సు మేరకు అదనంగా నలుగురు పోలీసులను కేటాయిస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ భద్రతాపరమైన చర్యలు తీసుకుంది.
ఇటీవల మంత్రికి మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖ వచ్చిన విషయం విధితమే. ప్రస్తుతం మంత్రికి భద్రతగా నలుగురు గన్‌మెన్‌లు, నలుగురు సివిల్ పోలీసులు ఉన్నారు. వీరికితోడు మరో నలుగురు సివిల్ పోలీసులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను మంత్రికి కల్పించింది. అయితే మావోయిస్టు హెచ్చరికల నేపథ్యంలో భద్రతను పెంచినట్లు మంత్రిక్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.