AP Govt : తెలంగాణలో ఓటున్న ఏపీ ఉద్యోగులకు నేడు వేతనంతో కూడిన సెలవు
తెలంగాణ, ఏపీ సరిహద్దులో అనేక మంది ఉద్యోగులు ఇరు రాష్ట్రాల్లోని జిల్లాల్లో పనిచేస్తున్నందున వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

AP Government (3)
AP Government Paid Leave : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఓటు కలిగిన ఏపీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం నేడు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. సచివాలయ ఉద్యోగుల సంఘం విజ్ఞప్తితో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఏపీ ఉద్యోగులకు సెలవు మంజూరు చేశారు.
తెలంగాణలో ఓటు హక్కు ఉన్న ఏపీ ఉద్యోగులు సరైన ఆధారాలు చూపించి సెలవు పొందవచ్చని తెలిపారు. ఈ మేరకు ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ, ఏపీ సరిహద్దులో అనేక మంది ఉద్యోగులు ఇరు రాష్ట్రాల్లోని జిల్లాల్లో పనిచేస్తున్నందున వారు తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.
KTR : ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. తెలంగాణ ప్రగతికి పునాదిగా నిలవాలి : మంత్రి కేటీఆర్
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు పో్లింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తెలంగాణలోని 33 జిల్లాలోని 119 అసెంబ్లీ నియోజకర్గాలకు ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 119 నియోజకర్గాల్లో 2,290 మంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. పోలీసుల నిఘా నీడల పోలింగ్ కొనసాగుతోంది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతోంది. లక్షమంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వరిస్తున్నారు. డిసెంబర్ 3న ఓట్ల కౌంటింగ్ జరుగునుంది.