ఏపీ సిట్‌కు ఫుల్ పవర్స్!.. ఎవరైనాసరే తప్పించుకోలేరు!

సిట్ కు విశేషాధికారాలు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి సిట్ ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. అసాధారణ రీతిలో సిట్‌నే పోలీస్ స్టేషన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. విచారణ నిమిత్తం రాష్ట్రం మొత్తాన్ని సిట్ పరిధిలోకి తెస్తూ జీవో జారీ చేసింది. దీంతో జీవోలో చెప్పిన దాని ప్రకారం.. ఎవరినైనా విచారణకు పిలిచి విచారించే అధికారం ఉంటుంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారించేందుకు జగన్ ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది.
ఇప్పుడు సిట్ కు సంపూర్ణ అధికారాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. దీంతో సిట్ బృందం రాష్ట్రంలో ఎక్కడనైనా తిరిగి చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు చేపట్టిన ప్రాజెక్టులపై ఏర్పడిన సంస్థలు, కార్పొరేషన్లతో పాటు అన్నింటిపైనా సమగ్ర విచారణకు చేసే అధికారం సిట్‌కు కల్పించినట్టు అయింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు, నిందితులు సిట్ ఎక్కడికి విచారణ నిమిత్తం రమ్మని కోరితే అక్కడికి వెళ్లి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సిట్ విచారణ చేసే ప్రాంతంలోనే విచారణ జరుపుకుంటూ వెళ్తే సమయం కలిసి వస్తుందని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. గత పాలనలో విచారణ ఎదుర్కోవాల్సిన వారు ఎవరైనా సరే విచారణను తప్పించుకునేందుకు వాయిదా వేయకుండా చర్యలు తీసుకునేలా వెసులుపాటును కూడా ఈ జీవో ద్వారా ప్రభుత్వం కల్పించింది. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గంలోని పలువురికి ఉచ్చు బిగించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికలో అవినీతి అంశాలపై సిట్ విచారణ చేయనుంది. చంద్రబాబు పాలనలో రాజధాని అమరావతి ప్రాంతంలోని భూముల వ్యహారాలపై వచ్చిన ఆరోపణలపై కూడా సిట్ విచారణ చేయనుంది. సీఆర్డీఏ రీజియన్ లో భూలావాదేవీల్లో అక్రమాలు జరిగాయని మంత్రివర్గ ఉపసంఘం తన నివేదికలో పేర్కొంది. ఆ లావాదేవీలతో సంబంధం ఉన్న ఏవ్యక్తులనునైనా అధికారులైనా మరి ఇతర వ్యక్తులను విచారణకు పిలిచే అధికారం సిట్‌కు అధికారం ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ప్రత్యేకింగా తెలిపింది. ఎవరినైనా విచారణ చేసేందుకు సిట్‌కు సంపూర్ణ అధికారాలు ఇవ్వడం రాజకీయంగా ఏపీలో దుమారం రేపనుంది. చంద్రబాబుతో సాహా నాటి మంత్రులతో పాటు టీడీపీలోని కొందరు ముఖ్యనేతలు కూడా సిట్ విచారణను ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.