Eluru Corporation : ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25న కౌంటింగ్ ను నిర్వహించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

Eluru Corporation : ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Eluru Corporation

Updated On : July 22, 2021 / 12:46 PM IST

eluru municipal corporation election counting : ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25న కౌంటింగ్ ను నిర్వహించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మార్చి 10న ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగాయి. అయితే కొందరు కోర్టుని ఆశ్రయించడంతో కౌంటింగ్ ను నిలిపేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వాదోపవాదాలు విన్న హైకోర్టు ఈ నెల 25న కౌంటింగ్ నిర్వహించుకోవడానికి అనుమతిచ్చింది.

కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే పలితాలు వెల్లడికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు కోర్టు అనుమతి ఇవ్వడంతో కౌంటింగ్ కు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. కోవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది ఎన్నికల కమిషన్. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

ఏలూరు కార్పొరేషన్ లో 50 డివిజన్లున్నాయి. వీటిలో మూడు స్థానాలను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకొంది. 47 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలోని కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో అధికార వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే.