ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఫలితాలు సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది.

ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఫలితాలు సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి..

AP Inter Supplementary Results

Updated On : June 7, 2025 / 11:41 AM IST

AP Inter Supplementary Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. మే 12 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి.. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,35,826 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 97,963 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలను https://resultsbie.ap.gov.in/ ద్వారా లేదా మనమిత్ర 9552300009 వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.

 

వెబ్‌సైట్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి..
అధికారిక వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.in/ లోకి వెళ్లాలి. ఫస్ట్ ఇయర్ జనరల్ రిజల్ట్స్, ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ రిజల్ట్స్, సెకండియర్ జనరల్ రిజల్ట్స్, సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్ అని నాలుగు విభాగాలు ఉంటాయి. అందులో మీకు కావాల్సిన దానిపై క్లిక్ చేయాలి. దానిక కింద హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ రిజల్ట్స్ పై క్లిక్ చేయాలి. మీ రిజల్ట్ వచ్చేస్తాయి.

వాట్సాప్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి..
♦ ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009 కు Hi అని మెసేజ్ చేయాలి.
♦ సర్వీస్ ఎంచుకోండి అని మెసేజ్ వస్తుంది.
♦ అందులో విద్య సేవలు అనే ఆప్షన్ ఎంపిక చేయాలి.
♦ ఇక్కడ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ని క్లిక్ చేయాలి.
♦ ఫస్లియర్ లేదా సెకండియర్ పై క్లిక్ చేసి ఆ తరువాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి.
♦ ఫలితాలు పీడీఎఫ్ రూపంలో డిస్ ప్లే అవుతాయి. డౌన్‌లోడ్ చూసుకోవచ్చు.