AP Intermediate Board Notice : స్టూడెంట్‌ను చితకబాదిన లెక్చరర్.. విజయవాడ చైతన్య కాలేజ్ భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు

విజయవాడ చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ విద్యామండలి చర్యలు చేపట్టింది. చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్యాంపస్ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

AP Intermediate Board Notice : స్టూడెంట్‌ను చితకబాదిన లెక్చరర్.. విజయవాడ చైతన్య కాలేజ్ భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు

AP Intermediate Board Notice

Updated On : September 17, 2022 / 6:30 PM IST

AP Intermediate Board Notice : విజయవాడ చైతన్య కాళాశాల ఘనటపై ఇంటర్మీడియట్ విద్యామండలి చర్యలు చేపట్టింది. చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్యాంపస్ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. సరైన వివరణ ఇవ్వకపోతే గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేసింది. శుక్రవారం స్టూడెంట్‌ను లెక్చరర్ దారుణంగా కొట్టారు.

స్టూడెంట్‌ను లెక్చరర్ చితకబాదిన ఘటనపై ఏపీ ఇంటర్ బోర్డు సీరియస్‌ అయింది. నిన్న సాయంత్రం ఫిర్యాదు రావడంతో ఇంటర్మీడియట్ విద్యామండలి జాయింట్ సెక్రటరీ జీఎస్ఆర్ కృష్ణారావు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే లెక్చరర్ రవికుమార్, ప్రిన్సిపాల్ నుంచి ఘనటకు సంబంధించి వివరాలను సేకరించారు.

Rajasthan: రాజస్థాన్‌లో మరో దళిత విద్యార్థిపై టీచర్ దాడి.. స్పృహ తప్పిన విద్యార్థి

ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సీఎస్ఎన్ రెడ్డి, ఆర్ఐఓ రవికుమార్, చైల్డ్ లైన్ అధికారులతో విచారణ చేయిస్తామని జీఎస్ఆర్ కృష్ణారావు చెప్పారు. చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా, స్టూడెంట్ పై లెక్చరర్ దాడి ఘటన ఏపీలో కలకలం రేపుతోంది.