AP Heavy Rains: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు.. టాప్‌ పైకి ఎక్కి కాపాడాలంటూ ప్రయాణికుల ఆర్తనాదాలు..

ఏపీలోని కడప జిల్లాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. రాజంపేట మండలంలో రెండు ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కకున్నాయి. టాప్‌ పైకి ఎక్కి కాపాడాలంటూ ప్రయాణికుల ఆర్తనాదాలు చేస్తున్నారు,.

AP Heavy Rains: వరద నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు.. టాప్‌ పైకి ఎక్కి కాపాడాలంటూ ప్రయాణికుల ఆర్తనాదాలు..

Ap Heavy Rains (1)

Updated On : November 19, 2021 / 1:24 PM IST

AP two RTC buses struck in flood water : ఏపీలో పలు జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన చిత్తూరు, అనంతపురం,కడప జిల్లాలో వర్షాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో కడప జిల్లాలో ప్రయాణీకులతో వెళుతున్న రెండు ఆర్టీసి బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో ప్రయాణీకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం అర్థిస్తున్నారు. బస్సు టాప్‌ ఎక్కి సహాయం కోసం ప్రయాణికుల ఆర్తనాదాలు చేస్తున్నారు. ఎడతెగకుండా భారీగా కురుస్తున్న వర్షాలు చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాలను ముంచేస్తున్నాయి. కుండపోత వర్షాలకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. వీధులు నదుల్ని తలపిస్తున్నాయి. ఇళ్లల్లోకి వరదనీరు ప్రవేశించటంతో కంటిమీద కునుకు లేకుండా ఎప్పుడు ఏం జరుగుతుందోనని తీవ్ర ఆందోళనకు గురిఅవుతున్నారు.

Read more : Heavy Rains : ఏపీలో భారీ వర్షాలు…మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులు

భారీ వర్షాలకు కడప జిల్లా రాజంపేట మండలంలో చెయ్యేరు నది పోటెత్తింది. దీంతో రామాపురం రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ వరద నీటిలో రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకున్నాయి. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో బస్సులు రహదారిపైనే ఆగిపోయాయి. బస్సులు కదిలితే వరద నీటిలో కొట్టుకుపోయేంత ఉదృతిగా నీరు ప్రవహిస్తోంది. దీంతో బస్సులను అలాగే వరద నీటిలోనే నిలిపివేశారు. ఈ రెండు బస్సుల్లో కలిసి సుమారు 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వరద ప్రవాహం ఎక్కువ అవుతుండడంతో ప్రయాణికులు భయంతో బెంబేలెత్తుతున్నారు. బస్‌ టాప్‌పైకి చేరుకుని సహాయం చేయాలని అరుపులు, కేకలతో అర్థిస్తున్నారు.

Read more : Rakesh Tikait : వ్యవసాయ చట్టాలను పార్లమెంట్ లో రద్దు చేశాకే ఆందోళనలు ముగిస్తాం : రాకేష్ టికాయత్

భారీ వర్షాలకు భారీగా వరద నీరు చేరుకోవటంతో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. ముఖ్యంగా నందలూరు, రాజంపేట మండలాల్లోకి వరద నీరు పోటెత్తుతోంది. చెయ్యేరు నది పరిసర ప్రాంతాలు జగ దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాగా ఈ వరదల్లో చిక్కుకుని కొట్టుకుపోయిన ముగ్గురి మృతదేహాలు నందలూరు వద్ద లభ్యమయ్యాయి.