Kodali Nani: ‘చంద్రబాబు ఒక వైరస్.. జగన్ రాష్ట్రానికి అదృష్టం’
ఏపీ మంత్రి కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు. చేస్తున్నదంతా దుష్ప్రచారమని, బ్లాక్ మార్కెట్లో దొంగ వ్యాపారం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.

Chandrabnau
Kodali Nani: ఏపీ మంత్రి కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి నిప్పులు చెరిగారు. చేస్తున్నదంతా దుష్ప్రచారమని, బ్లాక్ మార్కెట్లో దొంగ వ్యాపారం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో జరిగిన పనులపై ప్రశ్నిస్తే.. వాటిలో ఆయన ప్రమేయం లేదని ఒకవేళ ఉంటే తాను రాజకీయాలను వదిలి వెళ్లిపోతానని ఛాలెంజ్ విసిరారు.
కొడాలి నాని కామెంట్స్ ఇలా ఉన్నాయి. ‘నిత్యావసర సరుకుల ధరలపై చంద్రబాబు విష ప్రచారం చేస్తూ పక్క రాష్ట్రాల్లో కంటే ఎక్కువ ధరలు ఉన్నాయని దొంగ లెక్కలు చెప్తున్నారు. బయట మార్కెట్ కంటే హెరిటేజ్‌లోనే అధిక ధరలకు అమ్ముతున్నారు. కొన్ని వస్తువులకు ఎమ్మార్పీ కంటే 20 రూపాయలు అధికంగానే వసూలు చేస్తున్నారు’
సీఎం జగన్‌పై దుష్ప్రచారం
‘ప్రియా పచ్చళ్లకు ఉన్న రేట్లు బయట ఏ కంపెనీ ఉత్పత్తులకు లేవు. హెరిటేజ్, ప్రియా కంపెనీలు బయట వాటికంటే 30 శాతం అధికంగా అమ్ముతున్నాయి. బ్లాక్ మార్కెట్లో దొంగ వ్యాపారం చేసే చంద్రబాబు మళ్ళీ సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు’
ఇది కూడా చదవండి : తగ్గేదే లే అంటున్న కిమ్..హైపర్ సోనిక్ మిసైల్ ప్రయోగం
రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా
రైతుల దగ్గర తక్కువకే కొనుగోలు చేసి వినియోగదారులకు అధిక ధరలకు అమ్ముతూ లూటీ చేస్తున్నారు. టీడీపీని బలోపేతం చెయ్యాలంటే చంద్రబాబుని పక్కకు పెట్టాలి. చంద్రబాబుకి జీవితకాలం సమయం ఇస్తున్నా.. జగన్‌ని దించగలిగితే రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా. దించలేకపోతే హైదరాబాద్‌కే పరిమితం అయిపోవాలి.
చంద్రబాబు వైరస్.. జగన్ అదృష్టం
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు, రింగ్ రోడ్డుకి చంద్రబాబు సంబందం లేదు. చంద్రబాబు ప్రమేయం ఉందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా. రాష్ట్రానికి పట్టిన వైరస్ చంద్రబాబు. జగన్ రాష్ట్రానికి అదృష్టం. రాష్ట్రంలో 2.70 వేల మెట్రిక్ టన్నుల సిమెంట్ ని పేద వాళ్ళకి ఉపయోగపడే ప్రభుత్వ నిర్మాణాలకు 230 రూపాయలకు ధర నిర్ణయించిన ఘనత సీఎం జగన్‌ది.
ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రాం గోపాల్ వర్మ కామెంట్ కు రెస్పాన్స్:
రాష్ట్రం ముక్కలు కావడానికి కారణం చంద్రబాబు కదా..? రాంగోపాల్ వర్మకి నేను తెలియాలి అని లేదు. ఇందులో ఆశ్చర్యం లేదు. ఏపీ రాష్ట్రం ఉందని.. దానికి ఒక సీఎం ఉన్నారని ఇన్ని రోజులు వరకూ వాళ్లకు తెలియలేదు.. ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.. ఇంక నా గురించి వాళ్ళకేం తెలుస్తుంది. అంటూ కౌంటర్లు విసిరారు.