ఏపీ మంత్రులకు లోకల్ ఫీవర్.. టార్గెట్స్ రీచ్ అయితేనే.. లేదంటే బెర్త్ గోవిందా!

ప్రపంచాన్ని కరోనా ఫీవర్ కలవరపెడుతుంటే.. ఏపీలో మాత్రం లోకల్ ఫీవర్ రాజకీయ నేతలకు నిద్ర లేకుండా చేస్తోంది. అయితే ఈ లోకల్ వార్‌లో పోటీ చేసే వారికి ఫీవర్ ఎపెక్ట్ ఉండటం సహజమే అయినా.. దాని ఎఫెక్ట్‌తో ఆ పాతికమందికి కంటిమీద కునుకు లేకుండా పోయింది.
తేడా వస్తే ఎక్కడ తమకు బెర్తులకు ఎసరు వస్తుందోనని ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఏపీలో స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. నెలాఖరు వరకూ ఈ హడావిడి కొనసాగనుంది. అయితే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ తమ రికార్డును తామే బద్దలు కొట్టాలనే టార్గెట్‌తో ఉంది.
ఇందు కోసం పక్కా ప్రణాళికలు అమలు చేస్తున్నారు సీఎం జగన్. పార్టీ నేతలకు కఠినమైన ఆదేశాలిచ్చారు. గత రికార్డు బద్దలు కొట్టాలి లేదంటే మీ బెర్తులు గోవిందా అంటూ అధినేత వార్నింగ్ ఇవ్వడంతో మంత్రులంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
ఇప్పటికే జిల్లాలకు చేరుకున్న మంత్రులు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. సాధారణంగా లోకల్ వార్ అంటేనే లోకల్ గోడవలు, విబేధాలు తీవ్రంగా ఉంటాయి. అందులోనూ తక్కువ సమయం మాత్రమే ఉండటంతో అధినేత ఆదేశాలు వారిని కలవర పెడుతున్నాయి.
పోటీ చేసే వాళ్లు ఎలా ఉన్నా.. అసలు కష్టాలు తమకే వచ్చాయంటున్నారు మంత్రులు. జిల్లాలో ఎక్కడ తేడా వచ్చినా తమ మెడకే చుట్టుకుంటుంది కనుక ప్రతీ చిన్నగ్రామాన్నీ పట్టించుకునే పనిలో ఉన్నారు మంత్రులు. ఇక ఇంచార్జ్ మంత్రుల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.
పూర్తి బాధ్యతలు వారివే కనుక పుల్ టైం యాక్షన్‌లో దిగిపోయారు. రెండు రోజుల్లో నియోజకర్గాల సమావేశాలు ముగించేసిన మంత్రులు. గెలుపు గుర్రాల వేటలో పడ్డారు. మెత్తానికి మంత్రులకు లోకల్ ఫీవర్ ఎఫెక్టు ఎక్కువగానే కనిపిస్తోంది. మరి వారి టార్గెట్స్ ను ఎలా రీచ్ అవుతారో చూడాలి.