AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల వారికి అలెర్ట్

ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల వారికి అలెర్ట్

Updated On : October 15, 2024 / 7:48 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే ఆవకాశం ఉంది. రాగల 48 గంటల పాటు దక్షిణాకోస్తాంద్రలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉంది.

తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చెప్పింది. ఇవాళ పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లా­ల్లోని పలు ప్రాంతాల్లోవర్షాలు కురిసే అవకాశం ఉంది.

అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతా­రామ­రాజు, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురియొచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

నెల్లూరు జిల్లాలో జిల్లాలో సగటు వర్షపాతం 96.8 మి.మీ.గా నమోదైంది. జలదంకిలో అత్యధికంగా వర్షపాతం 177.6 మి.మీ.గా, సీతారాంపురంలో అత్యల్ప వర్షపాతం 40.4 మి.మీ.గా నమోదైంది. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

జీరో హ్యూమన్ లాస్, మినిమం డామేజ్ ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఆనంద్ సూచించారు. స్కూల్స్, జూనియర్ కాలేజీలకు కలెర్టర్ సెలవు ప్రకటించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోనున్నారు.

మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా?