AP Covid Update : ఏపీలో కొత్తగా 138 కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 138 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

AP Covid update
AP Covid Update : ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 138 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 25 మంది… కృష్ణా జిల్లాలో 24 మందికి… తూర్పుగోదావరిలో 23… మందికి కోవిడ్ సోకింది. కోవిడ్ నుంచి నిన్న 118 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,157 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Also Read : Cyclone Jawad Alert : బలపడుతున్న జొవాద్ తుపాను- ఉత్తరాంధ్రలో హై అలర్ట్
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,390 కి చేరింది. వీరిలో 20,56,788 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కోవిడ్ వల్ల నిన్న కృష్ణాజిల్లాలో ఒకరు మరణించటంతో ఇంతవరకు కోవిడ్ వల్ల రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 14,485కి చేరింది. నిన్నటి వరకు రాష్ట్రంలో 3,05,07,005మంది శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Ap Covid Reports