AP Corona Cases : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. విశాఖలో అత్యధికంగా

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 30వేల 717 కరోనా శాంపిల్స్ పరీక్షించారు.

AP Corona Cases : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. విశాఖలో అత్యధికంగా

Ap Corona Cases

Updated On : January 1, 2022 / 6:31 PM IST

AP Corona Cases : ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 30వేల 717 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. 176 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖపట్టణం జిల్లాలో అత్యధికంగా 40 కేసులు నమోదు కాగా, కడప జిల్లాలో అత్యల్పంగా ఒక కేసు నమోదైంది. కాగా, గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించకపోవడం ఊరటనిచ్చే అంశం.

ఇక ఇదే సమయంలో 103 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,74,426కి చేరుకుంది. వీరిలో 20,58,704 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 14వేల 495 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,227 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Vitamin D : శరీరానికి ఎండ తగలకపోతే… విటమిన్ డి లోపిస్తుందా?

కాగా, కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒమిక్రాన్ రూపంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. డెల్టా కన్నా వేగంగా వ్యాపిస్తూ భయాందోళనకు గురి చేస్తోంది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కలవరం రేపుతోంది. క్రమంగా కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.

ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనని నిపుణులు తేల్చి చెప్పారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మస్ట్ అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వాలు కూడా పెద్దఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపడుతున్నాయి. దాదాపుగా చాలామంది రెండు డోసులు తీసుకున్నారు. ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో ఇప్పుడు బూస్టర్ డోసు ఇచ్చేందుకు కేంద్రం సన్నద్ధమైంది. మానవాళికి ముప్పుగా మారిన కరోనావైరస్ మహమ్మారి నుంచి కాపాడుకోవాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే అని నిపుణులు తేల్చి చెప్పారు.

Omicron Symptoms : చర్మంపై ఇలా దురద, దద్దుర్లు ఉన్నాయా? ఒమిక్రాన్‌ లక్షణం కావొచ్చు..!

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, కఠిన నిబంధనలు అమలు చేయాలంది. ఒమిక్రాన్ కట్టడికి రాత్రి కర్ఫ్యూలు అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. భారీ సభలు, సమూహాలు నియంత్రించాలంది. బాధితుల శాంపిల్స్ ను ఆలస్యం చేయకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలంది. డెల్టా, ఒమిక్రాన్ కేసులపై తరచుగా పరిశీలన జరపాలని, పాజిటివిటీ, డబ్లింగ్ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలంది.

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధించాయి. అంతేకాదు కర్ఫ్యూ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని ఆంక్షలు పెట్టాయి. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు, హోటళ్లు, జిమ్‌లకు అనుమతిచ్చాయి. ఇండోర్ వేడుకల్లో 100 మందికి, బహిరంగ వేడుకల్లో 250 మందికే అనుమతి ఇచ్చాయి.