AP Corona Cases : ఏపీలో కొత్తగా 1,891 కరోనా కేసులు.. 5 మరణాలు

గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,891 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో మరో ఐదుగురు చనిపోయారు. కరోనా బారి నుంచి నిన్న 10వేల 241 మంది పూర్తిగా కోలుకున్నారు.

AP Corona Cases : ఏపీలో కొత్తగా 1,891 కరోనా కేసులు.. 5 మరణాలు

Ap Corona Cases

Updated On : February 8, 2022 / 6:02 PM IST

AP Corona Cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,891 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో మరో ఐదుగురు చనిపోయారు. అనంతపురంలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి నిన్న 10వేల 241 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 54వేల 040 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 26వేల 236 మందికి కరోనా పరీక్షలు చేశారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,06,943. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,38,226. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 14,677కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 440 కేసులు వెలుగుచూశాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, సోమవారంతో(1,597) పోలిస్తే మంగళవారం పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది.

Soaked Nuts : తినటానికి ముందు గింజలను ఎన్ని గంటలు నానబెట్టాలి?…

మరోవైపు దేశంలోనూ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. భారత్‌కు కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు తప్పినట్టేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానికి అనుగుణంగా రోజువారి పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. జనవరి మధ్యలో అత్యధిక కేసులు వెలుగు చూడగా.. ఇప్పుడు క్రమంగా మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న 80 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తే.. ఇవాళ ఆ సంఖ్య 70 వేల దిగువకు పడిపోయింది. ఇదే సమయంలో.. మృతుల సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగించే విషయం.

Safer Internet Day 2022: ఆన్‌లైన్‌లో మీ పిల్లలు జాగ్రత్త.. సేఫ్‌గా ఉంచేందుకు 5మార్గాలు ఇవే!

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 67వేల 597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ మృతుల సంఖ్య వెయ్యికి పైగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 1,188 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. దేశంలో కరోనా మృతుల సంఖ్య 5,02,874కు పెరిగింది. భారత్‌లో ప్రస్తుతం 9,94,891 కోవిడ్ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు ఇప్పటివరకు దేశ్యాప్తంగా 170 కోట్లకు పైగా (1,70,21,72,615) డోసుల వ్యాక్సిన్లు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా రోజువారి పాజిటివిటీ రేటు 5.02 శాతానికి దిగివచ్చింది. కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టినా.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిబంధనలు గాలికి వదిలేసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.