AP Corona : ఏపీకి బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన కరోనా కేసులు
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 220 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల

Ap Corona Cases
AP Corona : ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 220 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 24వేల 532 నమూనాలు పరీక్షించగా.. 220 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో నలుగురు కరోనాతో చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 429 మంది కోలుకున్నారు.
Triphala Churnam : త్రిఫల చూర్ణం రోజు తీసుకుంటే డాక్టర్ తో పనిలేదా?..
తాజాగా నమోదైన కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 51 కొత్త కేసులు వెల్లడి కాగా, చిత్తూరు జిల్లాలో 33 కేసులు గుర్తించారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,95,44,319 శాంపిల్స్‌ని పరీక్షించగా.. 20,66,670 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 20,48,151మంది కోలుకోగా.. 14,377 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4142 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: 01/11/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,63,775 పాజిటివ్ కేసు లకు గాను
*20,45,256 మంది డిశ్చార్జ్ కాగా
*14,377 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,142#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/elimflnUTl— ArogyaAndhra (@ArogyaAndhra) November 1, 2021