Raj Kasireddy: కసిరెడ్డి కోసం పోలీసుల వేట.. హైదరాబాద్‌లోని ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ సోదాలు..

విచారణకు హాజరుకాకుండా కసిరెడ్డి హైదరాబాద్ లో తలదాచుకున్నట్లు సిట్ అనుమానిస్తోంది.

Raj Kasireddy: కసిరెడ్డి కోసం పోలీసుల వేట.. హైదరాబాద్‌లోని ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ సోదాలు..

Updated On : April 14, 2025 / 7:38 PM IST

Raj Kasireddy: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు చేసింది. హైదరాబాద్ లోని రాజ్ కసిరెడ్డి ఇళ్లు, ఆఫీసుల్లో సిట్ బృందాలు తనిఖీలు చేశాయి. అరెటా ఆసుపత్రితో పాటు మరికొన్ని చోట్ల సిట్ బృందాలు సోదాలు చేశాయి. లిక్కర్ స్కామ్ లో సిట్ విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు కసిరెడ్డి. సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయి.

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి హైదరాబాద్ లో ఏపీ సిట్ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్ లో గాలిస్తున్నాయి. రాయదుర్గం పోలీసుల సాయంతో అరెటా ఆసుపత్రిలో ఏపీ సిట్ బృందాలు సోదాలు చేశాయి. రాజ్ కసిరెడ్డి కుటుంబసభ్యులు అరెటా ఆసుపత్రిలో డైరెక్టర్లుగా ఉన్నారు. విచారణకు హాజరుకాకుండా కసిరెడ్డి హైదరాబాద్ లో తలదాచుకున్నట్లు సిట్ అనుమానిస్తోంది.

Also Read : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ​అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం వచ్చేస్తోంది.. చంద్రబాబు ఏమన్నారంటే?

ఏపీ లిక్కర్ స్కామ్ లో రాజ్ కసిరెడ్డి కీలకపాత్ర పోషించినట్లు గుర్తించాయి. జూబ్లీహిల్స్ తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్ లో ఏపీ సిట్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రాజ్ కసిరెడ్డి దేశం దాటి వెళ్లకుండా ఇప్పటికే ఎల్ఓసీ ఇచ్చారు ఏపీ పోలీసులు. సిట్ విచారణకు హాజరుకావాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నారు రాజ్ కసిరెడ్డి. జూబ్లీహిల్స్ లోని రాజ్ కసిరెడ్డి నివాసానికి ఏపీ సిట్ బృందం నోటీసులు అంటించనుంది.

 

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here