ఏపీలో పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్

ఏపీలో పదవ తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షల టైమింగ్. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చిన వెంటనే టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ రిలీజ్ చేశారు.
* ఏపీలో టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
* మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు
* ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు పరీక్షలు
* మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1
* ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2
* ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్ పేపర్
* ఏప్రిల్ 4న ఇంగ్లీష్ పేపర్-1
* ఏప్రిల్ 6న ఇంగ్లీష్ పేపర్-2
* ఏప్రిల్ 7న మ్యాథమేటిక్స్ పేపర్-1
* ఏప్రిల్ 8న మ్యాథమేటిక్స్ పేపర్స్-2
* ఏప్రిల్ 9న జనరల్ సైన్స్ పేపర్-1
* ఏప్రిల్ 11న జనరల్ సైన్స్ పేపర్-2
* ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పేపర్-1
* ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్ పేపర్-2
* ఏప్రిల్ 16న ఓఎస్ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్ పేపర్-2
* ఏప్రిల్ 17న ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్టు థియరీ
ఏపీలో పదవ తరగతి పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మోగడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాగా, పరీక్షలు వాయిదా వేయాలని తామేమి ప్రభుత్వాన్ని కోరలేదని, ఇబ్బందులు కలగకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఏపీ ఎన్నికల కమిషనర్ రమేశ్ అన్నారు. షెడ్యూల్ ప్రకారం పదో తరగతి పరీక్షలు మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగాల్సి ఉంది.
ఎన్నికల సమయంలో పరీక్షలు జరిగితే సిబ్బంది కొరత వస్తుందనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించడం వల్ల తమకు సిబ్బంది కొరత కూడా ఉండదని భావిస్తున్నామని ఎన్నికల కమిషనర్ తెలిపారు.(JEE అడ్వాన్స్‌డ్-2020: దరఖాస్తుకు 6రోజులే…)