పశ్చిమ మధ్య బంగాళఖాతంలో వాయుగుండం.. విశాఖలో స్కూళ్లకు సెలవు
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సెలవు ప్రకటించారు.

పశ్చిమ మధ్య బంగాళఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. చెన్నైకి 390 కి. మీ., విశాఖకు 430 కి.మీ., గోపాల్ పూర్ కు 610కి.మీ. దూరంలో కేందీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉంది.
ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన చేశారు వాతావరణ వాఖ అధికారులు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పారు. అన్ని ప్రధాన ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ సెలవు ప్రకటించారు.
ప్రతికూల వాతావరణంలో చిన్నారులను బయటకు పంపించవద్దని తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు. పిల్లల రక్షణ, భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఎవరూ పాఠశాలలు తెరవడానికి వీలు లేదని స్పష్టం చేశారు.
Cm Chandrababu : ప్రజల భూములకు రక్షణ కల్పించేందుకు కొత్త చట్టం తీసుకొచ్చాం- సీఎం చంద్రబాబు