ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి చేదు అనుభవం

హిందూపూర్ ఎంపీ కురువ గోరంట్ల మాధవ్ కు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో గురువారం చేదనుభవం ఎదురైంది. సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయనను ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు.

ఏపీ భవన్‌లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి చేదు అనుభవం

MP Gorentla Madhav

Updated On : December 21, 2023 / 2:18 PM IST

AP Youth Congress – MP Gorantla Madhav : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి ఢిల్లీలోని ఏపీ భవన్ లో చేదు అనుభవం ఎదురైంది. గురువారం సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎంపీ గోరంట్ల మాధవ్ ని ప్రత్యేక హోదా విభజన హామీలపై ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు. ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదని, బీజేపీ వద్ద సాగిలపడ్డారని ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఎందుకు పోరాటం చేయడం లేదంటూ ప్రశ్నించారు. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన మాట ఏమైందంటూ ఏపీ యూత్ కాంగ్రెస్ నేతలు నిలదీశారు.

పార్లమెంట్ లో పోరాటం చేశామని ఎంపీ గోరెంట్ల మాధవ్ చెప్పారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమని, ప్యాజేజీకి ఒప్పుకున్నారని, అందుకే ప్రత్యేక హోదా రాలేదని ఎంపీ మాధవ్ ఆరోపించారు. పార్లమెంట్ లో అనేక సార్లు ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశామని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తున్నామని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు.

Also Read: సీఎం జ‌గ‌న్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఏపీ ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పాలి : లక్కారాజు
ఏపీ ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పాలని ఏపీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కారాజు రామారావు పిలుపునిచ్చారు. విభజన హామీలను వైసీపీ నెరవేర్చలేదని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోలవరం, ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.