ఏపీలో మద్యం షాపులకు అమెరికా, యూరప్ నుంచి దరఖాస్తులు..!
కొత్త షాపులు, కొత్త బ్రాండ్లు, కొత్త ధరలు, కొత్త మద్యం, కొత్త విధానం రాబోతోంది.

Ap Liquor Shop Tenders Applications (Photo Credit : Google)
Ap Liquor Shop Tenders : ఏపీలో మద్యం షాపులకు విదేశాల నుంచి దరఖాస్తులు వస్తున్నాయి. యూరప్, అమెరికా నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు నమోదయ్యాయి. అమెరికా నుంచి 20 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మద్యం షాపుల టెండర్లకు సంబంధించి దరఖాస్తు గడువు సమీపిస్తోంది. ఈ క్రమంలో ఎక్కువ మంది దరఖాస్తులు వేస్తున్నారు. ఇప్పటివరకు 70వేలకు పైగా టెండర్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 1500 కోట్ల రూపాయలకుపైగా డిపాజిట్లు వచ్చినట్లుగా సమాచారం. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇంకా దరఖాస్తులకు 24 గంటల సమయం ఉంది. 14వ తేదీన టెండర్లు ఓపెన్ చేస్తారు. మద్యం షాపుల టెండర్లకు సంబంధించి విదేశాల నుంచి కూడా అప్లికేషన్లు వచ్చాయి. ఒక్క అమెరికా నుంచే దాదాపుగా 20కి పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోంది. యూరప్ నుంచి కూడా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పెడుతున్నారు. రేపు రాత్రి వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. 14వ తేదీన టెండర్లు ఓపెన్ చేస్తారు. లాటరీ విధానం ద్వారా మద్యం షాపులు కేటాయిస్తారు. 16వ తేదీ నుంచి ఏపీలో కొత్త మద్యం షాపులు ప్రారంభం కానున్నాయి.
కొత్త షాపులు, కొత్త బ్రాండ్లు, కొత్త ధరలు, కొత్త మద్యం, కొత్త విధానం రాబోతోంది. మొత్తం మీద ప్రభుత్వం అనుకున్నదానికంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఒక్కో షాప్ కి రూ.2లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది నాన్ రీఫండబుల్ అమౌంట్. ఆ లెక్కన ఇప్పటివరకు 1500 కోట్ల రూపాయల వరకు అమౌంట్ వచ్చింది.
Also Read : రతన్ టాటా వారసుడు ఇతడేనా? ఎవరీ నోయల్ టాటా..? ముందున్న అతిపెద్ద సవాళ్లు ఏంటి?