APSRTC Bus : మార్గంమధ్యలో అర్ధరాత్రి ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. రాత్రంతా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు

బస్టాండ్ లో ఉండగానే బసు టైరు ప్రాబ్లం ఉందని.. ప్రత్యామ్నాయంగా మరో బస్సు అరెంజ్ చేయాలని అధికారులకు డ్రైవర్ చెప్పారు. టైరు బాగాలేని బస్సునే పంపడంతో మార్గంమధ్యంలో కంచికచర్ల ఫ్లై ఓవర్ వద్ద టైరు నుండి వాసన రావడంతో డ్రైవర్ బ్రేక్డౌన్ చేసి బస్సును పక్కన నిలిపివేశారు.

APSRTC Bus : మార్గంమధ్యలో అర్ధరాత్రి ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. రాత్రంతా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు

RTC bus

Updated On : July 10, 2023 / 8:54 AM IST

Bus Stopped Midnight : ఏపీఎస్ఆర్టీసీ గుడివాడకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు(AP16Z 740) ఎన్ టీఆర్ జిల్లా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఆగిపోయింది. మార్గంమధ్యలో రాత్రి పూట ఆర్టీసీ బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో బస్సు పంపాలని ఐదు గంటలుగా విజ్ఞప్తి చేసినా ఏపీఎస్ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న ప్రయాణికులకు రాత్రంతా ఇబ్బందులు పడ్డారు.

అయితే, బస్టాండ్ లో ఉండగానే బసు టైరు ప్రాబ్లం ఉందని.. ప్రత్యామ్నాయంగా మరో బస్సు అరెంజ్ చేయాలని అధికారులకు డ్రైవర్ చెప్పారు. టైరు బాగాలేని బస్సునే పంపడంతో మార్గంమధ్యంలో కంచికచర్ల ఫ్లై ఓవర్ వద్ద టైరు నుండి వాసన రావడంతో డ్రైవర్ బ్రేక్డౌన్ చేసి బస్సును పక్కన నిలిపివేశారు. బస్సు మధ్యలోని ఆగిపోవడంతో జోరు వానలో ఐదు గంటలుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Telangana Rains : రానున్న ఐదు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

ఇప్పటికీ రోడ్డుపైనే జోరు వానలో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్సు కిటికీ అద్దాలు సరిగా లేకపోవడంతో సీట్లు తడిచిపోయి ప్రయాణికులు తడిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆర్టీసీ అధికారులు కనీసం స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సులో 30 మంది ప్రయాణికులు ఇంకా రోడ్డుపైనే ఉన్నారు.

60, 70 ఏళ్లు పైపడ్డవారు కూడా బస్సులో ఉండడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. ప్రయాణికుల్లో పూరి యాత్రలకు వెళ్లిన వారు కూడా ఉండడంతో ఇంటికి ఎప్పుడు చేరుతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి రోడ్డు పక్కన బస్సు ఆపేయడంతో ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రయాణికులు అంటున్నారు.

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన 100 ఏళ్ల నాటి వంతెన

తెల్లారిన తర్వాత ఆడవాళ్లు, పెద్దలు టాయిలెట్ కు వెళ్లడానికి కూడా అవకాశం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. బస్సు సమస్య ఉందని ముందుగా తెలిసినా ఎందుకు మార్చకుండా పంపించారంటూ ఏపీఎస్ఆర్టీసీ అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్లే ఏపీఎస్ఆర్టీసీ పరువు పోతోందంటూ మండిపడుతున్నారు.