Jyothi Surekha : దేశానికి మూడు స్వర్ణ పతకాలు తీసుకురావడం సంతోషంగా ఉంది : ఆర్చరీ ప్లేయర్ జ్యోతి సురేఖ
ఏషియన్ గేమ్స్‌లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఆర్చరీ ప్లేయర్ జ్యోతి సురేఖ విజయవాడ చేరుకున్నారు. ఆమెకు శాప్ ప్రతినిధులు, విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు.

Archer Jyothi Surekha
Archer Jyothi Surekha : దేశానికి మూడు స్వర్ణ పతకాలు తీసుకురావడం సంతోషకరంగా ఉందని ఆర్చరీ ప్లేయర్ జ్యోతి సురేఖ అన్నారు. తన ఫ్యామిలీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధించగలిగానని తెలిపారు. ఏషియన్ గేమ్స్‌లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఆర్చరీ ప్లేయర్ జ్యోతి సురేఖ విజయవాడ చేరుకున్నారు.
ఆమెకు శాప్ ప్రతినిధులు, విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. టీమ్, వ్యక్తిగత ఈవెంట్స్‌లో మూడు స్వర్ణాలు సాధించిన సురేఖకు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఈ సందర్భంగా జ్యోతి సురేఖ మాట్లాడుతూ ఒలంపిక్స్ లో కాంపౌండ్ ఆర్చరీ లేకపోవడం బ్యాక్ డ్రాప్ అయినా తాను పట్టించుకోనని చెప్పారు.
భవిష్యత్ లో గోల్స్ రీచ్ అయ్యేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తనను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగంతో పాటు స్పోర్ట్స్ పాలసీ ప్రకారం తనకు అన్నివిధాల సపోర్ట్ చేస్తున్నారని వెల్లడించారు.