Devineni Uma: టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమాపై దాడి

మాజీమంత్రి దేవినేని ఉమాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమాపై జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్ద అడ్డుకున్నారు.

Devineni Uma: టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమాపై దాడి

D Uma

Updated On : July 27, 2021 / 9:21 PM IST

Devineni Uma: మాజీమంత్రి దేవినేని ఉమాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమాపై జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్ద అడ్డుకున్నారు. ఈ సమయంలో దేవినేని ఉమ కారుపై రాళ్ళ దాడికి దిగారు దుండగులు. అయితే, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులే దాడికి పాల్పడ్డారంటూ దేవినేని ఉమా ఆరోపిస్తున్నారు.

సంఘటన స్థలానికి టీడీపీ వర్గాలు, వైసీపీ వర్గాలు భారీగా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తం అయ్యింది. తోపులాట చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఉమా వాహనం అద్దాలు ద్వంసం అయ్యాయి. పోలీసులు ఉమాను అక్కడి నుంచి భద్రత కల్పించి తరలించారు.

పోలీసులు భద్రత కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ దేవినేని ఉమా జి.కొండూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి దేవినేని ఉమాకు చంద్రబాబు ఫోన్‌ చేసి వివరాలు కనుక్కున్నారు.  దేవినేని ఉమా అంతకుముందు మాట్లాడుతూ.. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్‌తో వందల కోట్లు దోపిడీ జరుగుతుందని ఆరోపించారు. అటవీశాఖ చట్టాలను ఉల్లంఘించి విలువైన వృక్షసంపదను నరికివేశారని అన్నారు.

లక్షల టన్నుల గ్రావెల్ దోపిడీకి గురైందంటూ విమర్శించారు. మైలవరంలో సహజ వనరులు అక్రమంగా దోచేస్తున్నారని, వైసీపీ నేతలు, బంధువుల అవినీతిపై జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.