Bharat Jodo Yatra : ఏపీలోకి ఎంటరైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర .. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు..రైతులు

భారతదేశం ఏకం కావాలంటూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రం ఆంధ్రపదేశ్ లోకి ఎంటర్ అయ్యింది. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన అనంతపురం జిల్లాలోని డి.హీరేహాల్ మండలం కనుగొప్ప గ్రామంలో ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ అడుగు పెట్టారు. దీంతో ఏపీ కాంగ్రెస్ నేతలు రాహల్ గాంధీకి ఘనంగా స్వాగతం పలికారు.

Bharat Jodo Yatra : ఏపీలోకి ఎంటరైన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర .. ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు..రైతులు

 Rahul gandhi Bharat Jodo Yatra

Updated On : October 14, 2022 / 11:51 AM IST

Rahul gandhi Bharat Jodo Yatra : భారతదేశం ఏకం కావాలంటూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రం శుక్రవారం (అక్టబోర్ 14,2022) ఆంధ్రపదేశ్ లోకి ఎంటర్ అయ్యింది. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన అనంతపురం జిల్లాలోని డి.హీరేహాల్ మండలం కనుగొప్ప గ్రామంలో ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ అడుగు పెట్టారు. దీంతో ఏపీ కాంగ్రెస్ నేతలు రాహల్ గాంధీకి అత్యంత ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం వారు కూడా రాహల్ తో కలిసి అడుగులు వేశారు. ఈరోజు ఏపీలో 14 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు రాహుల్ గాంధీ.

అనంతరం సాయంత్రం 04.30 గంటలకు పాదయాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. తిరిగి ఓబుళాపురం మీదుగా రాహల్ కర్ణాటకలోకి ప్రవేశించనున్నారు. కర్ణాటక నుంచి తిరిగి అక్టోబర్ 18న తిరిగి రాహల్ ఏపీలోకి ఎంటర్ కానున్నారు.18నుంచి 20 వరకు అంటే మూడు రోజులపాటు రాహుల్ ఏపీలో పాదయాత్ర చేసి 21 తిరిగి మరోసారి కర్ణాటకలోకి వెళ్లనున్నారు. ఇలా ఆంధ్రపదేశ్ లో మొత్తం నాలుగు రోజుల పాటు భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది.

రాహుల్ గాంధీ పాదయాత్ర జరిగే రూట్లో ఏర్పాట్లను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్, కేంద్రమాజీమంత్రి జేడీ శీలం, కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ కే రాజు, ఏఐసీసీ సెక్రటరీ రుద్రరాజు, ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు గురునాథ్ రావు పరిశీలించారు. అనంతపురంలో రాహుల్ గాంధీకి వీరంతా ఘనస్వాగతం పలికారు. కాంగ్రెస్ నేతలతో పాటు రైతులు కూడా పెద్ద సంఖ్యలో రాహుల్ కు స్వాగతం పలికారు. ఆయనతో కలిసి నడిచారు.