పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్

పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారు. అందుకే నాగబాబు ఫోన్ స్విచాఫ్ చేశారు. చిరంజీవి సౌమ్యుడు, ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్

bhimavaram mla grandhi srinivas counter to pawan kalyan

grandhi srinivas counter to pawan kalyan: తనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ కు మతిస్థిమితం లేదని, ఆయనను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపించాలని అన్నారు. పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారని ఆరోపించారు. స్థానికంగా ఉన్న తనను పవన్ కళ్యాణ్ తరిమి కొట్టాలని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

”పవన్ కళ్యాణ్ అడిగితే భీమవరంలో నా పేరున ఉన్న 9 ఎకరాల్లో.. ఎకరం కావాలో రెండు ఎకరాలు కావాలో అడిగితే అమ్ముతాను. పవన్ కళ్యాణ్ పక్కనున్న కాపు నాయకులు ఎందుకు ఆయనకు దూరంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ సొంత అన్న నాగబాబుకు కూడా అన్యాయం చేశారు. అందుకే నాగబాబు ఫోన్ స్విచాఫ్ చేశారు. చిరంజీవి సౌమ్యుడు, ప్రజారాజ్యం పార్టీలో 18 సీట్లు గెలిచి 80 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. నేను రౌడీ ఎమ్మెల్యే అయితే నాపై ఒక్క క్రిమినల్ కేసైనా ఉందా?

పులపర్తి రామాంజనేయులు పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు. కొటికలపూడి గోవిందరావు ఐదు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశాడు. భీమవరం కంపోస్ట్ యార్డు సమస్యను వారు ఎందుకు పరిష్కరించలేకపోయారు? కంపోస్ట్ యార్డుకు ఆరు ఎకరాల భూమిని నేనే సేకరించాను. స్థానికంగా ఉన్న నన్ను పవన్ కళ్యాణ్ తరిమి కొట్టాలని అనడం హాస్యాస్పదం. తరిమితే వెళ్లే వాడిని కాదు.. ప్రజా సేవ అనేది మా బ్లడ్ లోనే ఉంది. 2019లో భీమవరం నియోజకవర్గంలో ప్రజలే ఆయనను భీమవరం నుంచి ఆయనను తరిమికొట్టారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు.

Also Read: గ్రంధి శ్రీనివాసును అక్కడి నుంచి తరిమేయాలి.. పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్