Vizianagaram MLC election: విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్
ఊహించని విధంగా రఘురాజు అనర్హత ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో కథ యూటర్న్ తీసుకుంది.

Chandrababu-Jagan
ఎన్నికల హడావుడి మొదలైంది. పార్టీలన్నీ ఓవర్ టు విజయనగరం అన్నట్లుగా సీన్ మార్చేశాయ్. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు వైసీపీ అభ్యర్థిని కూడా అనౌన్స్ చేసింది. గెలుపోటములపై కూటమి లెక్కలు వేసుకుంటుండగానే..హైకోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. విజయనగరం ఎమ్మెల్సీ బైపోల్ ఊహించని ట్విస్ట్ తిరిగింది.
రఘురాజు అనర్హత ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం సంచలనం అవుతుంది. రఘురాజు వాదనలు వినకుండానే మండలి ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారన్న హైకోర్టు.. అనర్హత ఉత్తర్వులు రద్దు చేసింది. మరోసారి ఈ విషయాన్ని పరిశీలించాలని మండలి ఛైర్మన్ దగ్గరకు ఈ వ్యవహారాన్ని పంపింది. అప్పటివరకు రఘురాజు ఎమ్మెల్సీ సభ్యత్వం కొనసాగిస్తున్నట్లు తెలిపింది హైకోర్టు.
రఘురాజు అందుకే ఏపీ హైకోర్టుకు..
దీంతో నవంబర్ 28న విజయనగరం ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది 2021లో జరిగిన విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరపున ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికలకు ముందు రఘురాజు భార్య ఇందుకూరి సుధారాణి వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయ్యారు. దీంతో పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని..రఘురాజుపై వైసీపీ మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. వైసీపీ కంప్లైంట్‌తో..వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఇందుకూరి రఘురాజుకు నోటీసులు ఇచ్చారు మండలి చైర్మన్.
అయితే ఆ తర్వాత రఘురాజు వివరణ ఇవ్వలేదంటూ ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారంటూ రఘురాజు అప్పుడే ఏపీ హైకోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఈసీ విజయనగరం ఎమ్మెల్సీ బైపోల్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఒక రోజు వ్యవధిలోనే హైకోర్టులో రఘురాజు పిటిషన్ విచారణకు వచ్చింది. మండలి ఛైర్మన్ ఇచ్చిన అనర్హత ఉత్తర్వులను కోర్టు రద్దు చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు అయింది.
కోర్టు ఓవర్ టు మండలి ఛైర్మన్ అనడంతో..అనర్హత ప్రాసెస్ అంతా మళ్లీ మొదటి నుంచి కొనసాగే అవకాశం ఉంది. రఘురాజు వివరణ తీసుకునేందుకు మండలి ఛైర్మన్ ఆయనకు మళ్లీ నోటీసులు ఇస్తారా..లేక కోర్టులో పిటిషన్ వేస్తారా అన్నది క్లారిటీ రావడం లేదు. వైసీపీ ఏం చేయబోతుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.
వైసీపీకి కోర్టు తీర్పుతో షాక్
తాము ఇచ్చిన ఫిర్యాదుతో అనర్హత వేటు పడటంతో.. మరో అభ్యర్థిని పెట్టి గెలిపించుకుందామనుకున్న వైసీపీకి కోర్టు తీర్పు షాక్ ఇచ్చింది. ఈ సిచ్యువేషన్‌లో మండలి ఛైర్మన్‌తో పాటు వైసీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే హైకోర్టు తీర్పును బట్టి కేంద్ర ఎన్నికల సంఘం విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన ఇందుకూరి రఘురాజు పదవీకాలం 2027 నవంబర్ 31 వరకు ఉంది.
కోర్టు తీర్పు కంటే ముందే ఎన్నికల నోటిఫికేషన్ రావటంతో వైసీపీ విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత శంబంగి వెంకట చిన అప్పల నాయుడు పేరును జగన్ ఖరారు చేశారు. అయితే చిన అప్పలనాయుడు అభ్యర్థిత్వాన్ని వైఎస్ జగన్ ఖరారు చేసిన కాసేపటికే.. ఏపీ హైకోర్టు ఇందుకూరి రఘురాజుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే వైసీపీ అభ్యర్థి నామినేషన్ కూడా వేశారు.
అయితే ఉమ్మడి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల్లో వైసీపీకి పూర్తిస్థాయిలో మెజారిటీ ఉంది. దీంతో ఎన్నికల్లో ఈజీగా గెలువొచ్చనుకున్నారు. ఊహించని విధంగా రఘురాజు అనర్హత ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో కథ యూటర్న్ తీసుకుంది. అయితే విజయనగరం ఎమ్మెల్సీ బైపోల్‌లో పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరిన వైసీపీ..త్వరలో రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉంటోంది. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది వైసీపీ.
KTR: కేటీఆర్‌ది తప్పు చేయలేదన్న ధీమానా? అరెస్ట్‌కు సిద్ధమయ్యారా.?