BJP Somu Veerraju : మరోసారి జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించిన సోము వీర్రాజు

జూనియర్ ఎన్టీఆర్ పై బీజేపీ నేతల ప్రశంసలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మరోసారి జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు. గురుపూజోత్సవంలో జూ.ఎన్టీఆర్ ను ప్రస్తావించారు. జూ.ఎన్టీఆర్ మంచి నటుడని అన్నారు.

BJP Somu Veerraju : మరోసారి జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించిన సోము వీర్రాజు

BJP Somu Veerraju

Updated On : September 5, 2022 / 8:43 PM IST

BJP Somu Veerraju : జూనియర్ ఎన్టీఆర్ పై బీజేపీ నేతల ప్రశంసలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మరోసారి జూ.ఎన్టీఆర్ పేరు ప్రస్తావించారు. గురుపూజోత్సవంలో జూ.ఎన్టీఆర్ ను ప్రస్తావించారు. జూ.ఎన్టీఆర్ మంచి నటుడని అన్నారు. బాల రామాయణంలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారని ప్రశంసించారు. జూ.ఎన్టీఆర్‌ సేవలు ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటామని క్లారిటీ ఇచ్చారు.

జూ.ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువని, అతని సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. జనసేనతో కలిసే ముందుకెళ్తామని అదే సమయంలో జూ.ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుంటామని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జూనియర్ ఎన్టీఆర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది.

CPI Narayana : జూ.ఎన్టీఆర్ పై నారాయణ ఆగ్రహం.. అమిత్ షాను కలవాల్సిన కర్మ ఏంటి?

కొన్ని రోజులక్రితం తెలంగాణలో పర్యటించిన అమిత్‌షా.. హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సోము వీర్రాజు జూనియర్ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడటం..టీడీపీ, జనసేన వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.