మరోసారి హాట్ టాపిక్‌గా వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొత్త మలుపు

కొన్ని అంశాలపై మాత్రం ఇన్వెస్టిగేషన్‌కు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.

మరోసారి హాట్ టాపిక్‌గా వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో కొత్త మలుపు

Viveka

Updated On : December 11, 2025 / 9:39 PM IST

Viveka case: వైఎస్ వివేకా హత్య కేసు క్లైమాక్స్‌లో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఒక అడుగు ముందుకు..రెండు అడుగులు వెనక్కు..ఆల్‌ మోస్ట్ దర్యాప్తు కంప్లీట్..అయినా ఇంకా ఎక్కడో డౌట్ అన్నట్లుగా కొనసాగుతోన్న వివేకా హత్య కేసు వివాదం ఎంతకు కొలిక్కి రావడం లేదు. వివేకా కూతురు సునీత న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్‌గా ఆమె లేవనెత్తిన పలు అంశాలపై దర్యాప్తునకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే వివేకా హత్య కేసులో నిందితుల ఫోన్ కన్వర్జేషన్ కీలక ఆధారంగా మారింది.

ఇప్పటికే వివేకా హత్య కేసు తొలి దర్యాప్తు అధికారి సీఐ శంకరయ్యను ఏపీ సర్కార్ డిస్మిస్ చేసింది. వివేకా ‌హత్య జరిగినప్పుడు పులివెందుల ‌సీఐగా ఉన్న శంకరయ్య.. సాక్ష్యాధారాలు చేరిపివేస్తున్నా చూస్తూ ఊరుకున్నారన్న ఆరోపణలను ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌ ఇలా ఉండగానే లేటెస్ట్‌గా సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఆసక్తికరంగా మారాయి.

వివేకా హత్య కేసులో ఇన్ డీటేయిల్డ్ దర్యాప్తు జరగలేదని, పలు అంశాలపై దర్యాప్తు అసంపూర్తిగా ఉందని నిందితులు చెప్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీబీఐ కోర్టును కోరారు సునీతారెడ్డి. వివేకా హత్య కేసులో మిగతా దర్యాప్తు కంటిన్యూ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు..కీలక ఆదేశాలు ఇచ్చింది.

Also Read: AP Cabinet: గుడ్‌న్యూస్‌.. ఈ పథకం కింద కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా బీసీలకు ఏపీ సర్కారు రూ.20 వేలు

వివేకా హత్య కేసులో కొన్ని అంశాలపై రీఇన్వెస్టిగేషన్‌కు సీబీఐ కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు డైరెక్షన్‌లో కేసును మళ్లీ విచారించాలని వివేకా కూతురు సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు..కొన్ని అంశాలపై మాత్రం ఇన్వెస్టిగేషన్‌కు అనుమతులు ఇచ్చింది. A2 సునీల్ యాదవ్ బ్రదర్ కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. నెల రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది.

సీబీఐ కోర్టు ఉత్తర్వులు ప్రకారం వివేకా హత్య కేసులో మళ్లీ పాక్షిక దర్యాప్తు జరగనుంది. ఆ ఇద్దరి ఫోన్ కన్వర్జేషన్‌పై దర్యాప్తునకు సీబీఐ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ కేసులో సునీత వ్యక్తం చేసిన అన్ని సందేశాలపై కోర్టు విచారణకు అనుమతించలేదు. అంతేకాకుండా పాక్షిక దర్యాప్తును నెలరోజుల్లో పూర్తి చేయాలని కూడా కోర్టు చెప్పడం ఉత్కంఠ రేపుతోంది.

నిందితులకు కాస్త రిలీఫే!
అయితే సునీత వ్యక్తం చేస్తున్న డౌట్స్‌పై కోర్టు విచారణకు ఆదేశించకపోవడం..నిందితులకు కాస్త రిలీఫేనన్న చర్చ జరుగుతోంది. హత్య జరిగిన రోజు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి వైసీపీ పెద్దలకు ముందే సమాచారం ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు సునీత. ఈ విషయంపై దర్యాప్తు జరపలేదని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిటైర్డ్ ఐఏఎస్ అజేయ్‌ కల్లం తన వాంగ్మూలంలో ఉదయం 5 గంటలకు హైదరాబాద్ లోటస్ పాండ్‌లో తాము జగన్‌తో సమావేశంలో ఉండగా, భారతి నుంచి జగన్‌కు పిలుపు వచ్చిందని, ఆ తర్వాత జగన్ తమతో వివేకా మరణంపై చెప్పారని అజేయ్ కల్లాం వాంగ్మూలమిచ్చారని గుర్తు చేశారు సునీత.

అయితే భారతికి ఎలా సమాచారం వచ్చింది.? ఎవరి నుంచి వచ్చిందన్న అంశంపై సీబీఐ దర్యాప్తు చేయలేదని, ఆ అంశాలపై దర్యాప్తు చేయాలని సునీత కోరారు. కేసు విచారణను సీబీఐ సగంలోనే వదిలేసిందని, నిందితులు పొంతన లేని వాంగ్మూలాలు ఇవ్వడంపైనా సీబీఐ దృష్టిపెట్టలేదని సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే కోర్టు మాత్రం సునీత లేవనెత్తిన అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలపైనే దర్యాప్తునుకు ఆదేశించింది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 1.42 గంటల సమయంలో కిరణ్ యాదవ్ నుంచి అర్జున్ రెడ్డికి..వివేకా సర్ చనిపోయాడనే మెసేజ్ వెళ్లిందని సీబీఐ గుర్తించింది. కానీ, ఆ మెసేజ్‌పై దర్యాప్తు చేయలేదని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఈ విషయంపైనే దర్యాప్తు కొనసాగనుంది.