Chandrababu Bail : చంద్రబాబుకు బెయిల్.. టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద సంబరాలు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేయడంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బాబుకు బెయిల్ లభించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్ తో బయట ఉన్నారు. మరో 8 రోజుల్లో మధ్యంతర బెయిల్ సమయం ముగుస్తుందనగానే రెగ్యూలర్ బెయిల్ లభించింది. దీనికితోడు ఈనెల 29 నుంచి రాజకీయ సభలు, కార్యక్రమాల్లో కూడా చంద్రబాబు పాల్గొవచ్చని కోర్టు తెలిపింది.
Also Read : Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట..
టీడీపీ కార్యాలయం వద్ద సంబురాలు..
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేయడంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబుకు బెయిల్ రావడంతో మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు బాణసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలతోపాటు పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : Karimnagar : కేసీఆర్ ఎన్నికల ప్రచార రథంలో తనిఖీలు.. సహకరించిన గులాబీ బాస్, సిబ్బంది
కళావెంకటరావు కామెంట్స్ ..
చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని కళావెంకటరావు అన్నారు. చంద్రబాబు నాయుడు తప్పు చేశారని నిరూపించలేకపోయావు జగన్.. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం, ఆయనో మేలు పర్వతం అని కళా వెంకటరావు అన్నారు. సూర్యుడుపై ఉమ్మి వేస్తే అది నీపైనే పడుతుందని గ్రహించు జగన్. తప్పుడు కేసులు పెట్టి నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరించడం దారుణం.రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు.
అచ్చెన్నాయుడు కామెంట్స్ ..
చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అక్రమ కేసులపై మా పోరాటం ఫలించింది. తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవని నిరూపితమైంది. ఇకనైనా జగన్ రెడ్డి బుద్ధి తెచ్చుకుని కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. త్వరలోనే చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వస్తారని అచ్చెన్నాయుడు అన్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప మాట్లాడుతూ.. చంద్రబాబు పూర్తిస్థాయి కార్యక్రమాలు ఈనెల 29నుంచి ప్రారంభమవుతాయి. ఈలోపు మిగిలిన కేసుల్లోనూ బెయిల్ వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ వచ్చిందన్న ఆనందం కంటే 50రోజులకుపైగా అన్యాయంగా జైల్లో నిర్భందించారనే బాధ ఎక్కువగా ఉందని అన్నారు. అవినీతి ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలులేకే పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ముగాచూపే యత్నం చేసి జగన్ దెబ్బతిన్నారని అన్నారు.
ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ.. చంద్రబాబుపై అవినీతి బురద వేయటం వైసీపీ తరం కాదు. 29నుంచి చంద్రబాబు పులిలా ప్రజల్లోకి వస్తారని అన్నారు.