Polavaram Project : పోలవరానికి రూ.2,800 కోట్లు విడుదలచేసిన కేంద్రం

2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే...

Polavaram Project : పోలవరానికి రూ.2,800 కోట్లు విడుదలచేసిన కేంద్రం

Polavaram Project

Updated On : October 8, 2024 / 10:32 AM IST

Polavaram Project : పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ. ,800 కోట్ల నిధులను విడుదల చేసింది. పాత బిల్లుల రీయింబర్స్ మెంట్ కింద రూ. 800 కోట్లు, అడ్వాన్సుగా పనులు చేపట్టేందుకు రూ. 2000 కోట్లు విడుదల చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం అయ్యాక కేంద్రం నుంచి ఇంత వేగంగా సానుకూల నిర్ణయాలు తీసుకోవడం, నిధుల మంజూరు కావడం ఇదే తొలిసారి అని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

Also Read: Election Results 2024: హరియాణాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ.. జమ్మూకశ్మీర్ లో ఎన్సీ కూటమి ఆధిక్యం.. Live Blog

2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం తొలుత సొంత నిధులతో పనులు చేయిస్తే వాటికి కేంద్రం దశలవారీగా డబ్బు చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 6వేల కోట్లు, వచ్చే ఏడాది రూ. 6,157 కోట్లు మంజూరుకు కేంద్రం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదిలాఉంటే.. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలను పోలవరం ప్రాజెక్టుకు సందర్శనకు ఆర్టీసీ బస్సుల్లో తీసుకెళ్లి ఉచితంగా భోజనాల సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి 2018 డిసెంబర్ నుంచి 2019 మార్చి వరకు ఖర్చు చేసిన నిధులను కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించగా.. 12శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది. దీంతో మొత్తం రూ. 23.11 కోట్ల నిధుల విడుదలకు జలవనరుల శాఖ తాజాగా ఆమోదం తెలిపింది.