TDP Celebrations : చంద్రబాబుకు బెయిల్ మంజూరు, టీడీపీ శ్రేణుల సంబరాలు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో టీడీపీ నేతల్లో సంబరాల్లో మునిగిపోయారు. అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.

TDP Celebrations : చంద్రబాబుకు బెయిల్ మంజూరు, టీడీపీ శ్రేణుల సంబరాలు

Chandrababu Bail TDP Celebrations

Updated On : October 31, 2023 / 1:15 PM IST

TDP Leaders Celebrates Interim Bail of Chandrababu :  స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయటంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. హనుమాన్ జంక్షన్ లో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాకాయలు పేల్చి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

అమరావతి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద అచ్చెన్నాయడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు టీడీపీ నేతలు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చంద్రబాబుపై పెట్టిన ఏ అక్రమ కేసు నిలబడదన్నారు. తదుపరి కార్యక్రమాలను నేతలంతా చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన సంబరాల్లో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జనార్దన్ మాట్లాడుతూ.. చంద్రబాబు బయటకు కాలుపెట్టిన సమయం నుంచి జగన్ పతనం ప్రారంభమైనట్లేనన్నారు. చంద్రబాబుని ఇక ఏ శక్తీ ఆపలేదన్నారు. ఆయనపై పెట్టిన అన్ని కేసులు అక్రమమని త్వరలోనే తేలిపోతుంది అంటూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.

Also Read: చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నాం : పురందేశ్వరి

కాగా.. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన సందర్భంగా టీడీపీ నేతలు, శ్రేయోభిలాషులు ఆయన కుమారుడు నారా లోకేశ్ కు, భార్య భువనేశ్వరిలకు అభినందనలు చెబుతున్నారు. చంద్రబాబు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ దగ్గర టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా కలిసి టపాసుల కాల్చి ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. జై జై బాబు అంటూ నినాదాలు చేశారు.