కరోనా నివారణకు బాబు విరాళం

కరోనా నివారణకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు విరాళం ప్రకటించారు. రూ. 10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత విరాళంతో పాటు టీడీపీ ఎమ్మెల్యే నెల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇస్తున్నట్లు తెలిపారు. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాను ఎదుర్కొనేందుకు అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఏపీలో కరోనా విస్తరిస్తోంది. ఈ క్రమంలో సీఎం జగన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రమంతటా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజలు నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాల్సిందేనని ప్రభుత్వం తేల్చిచెప్పింది. లేనిపక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించింది.
* తెలంగాణ తరహాలో ఆంక్షలు విధించనుంది.
* ఉదయం, సాయంత్రం ప్రత్యేక సమయాల్లోనే నిత్యావసరాలు కొనుగోలు చేయాలని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.
* లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని కోరారు.
* నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
* వ్యక్తిగత భద్రత సామాజిక బాధ్యత అని గుర్తించాలన్నారు.
* ఏపీలోని 7 వైద్య కళాశాలల్లో కరోనా ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
* భారత దేశంలో కరోనా మృతుల సంఖ్య 10కి చేరింది.