ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ ఆటలు సాగనివ్వను : చంద్రబాబు

నెల్లూరు: తెలంగాణాలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి, ఇప్పుడు ఏపీపై పెత్తనం చేయటానికి కేసీఆర్.. జగన్ తో కుమ్మక్కయారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. నేను బతికి ఉండగా కేసీఆర్ ఆటలు.. ఏపీలో సాగనివ్వనని శపథం చేశారు. నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ నాయకులు అడ్డు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also : గాజువాక నుంచి పవన్ కల్యాణ్ పోటీ
పోలవరం ప్రాజెక్టుపై కోర్టుల్లో కేసులు వేస్తున్నారని మండిపడ్డారు. చెంచా గిరి చేసే జగన్ ను అడ్డం పెట్టుకుని.. ఏపీ పై పెత్తనం చేయటానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు బాబు. విభజనచట్టం ప్రకారం రావాల్సినవి రాకుండా.. కేసీఆర్ అడ్డుపడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్ధులను గెలిపిస్తే వాళ్లు కేసీఆర్ కి బీ టీమ్ లాగా ఉంటారని చంద్రబాబు తెలిపారు.
టీడీపీలోని 65 లక్షల మంది కార్యకర్తలే తెలుగుదేశం బలమని చంద్రబాబు అన్నారు. టీడీపీకి చెందిన కార్యకర్తల డేటా దొంగిలించి లబ్ది పొందాలని వైసీపీ చూసిందని ఆరోపించారు. స్వార్ధం కోసం కొందరు పార్టీ మారుతున్నారని.. అటువంటి వారిని ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాకు నీరు తెచ్చేందుకు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని చెప్పారు. నెల్లూరులో 10 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ స్ధానాలు గెలుస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
Read Also : గుంటూరు వెస్ట్ అసెంబ్లీ బరిలో హీరోయిన్