జగన్ మళ్లీ జైలుకి వెళ్తే ఏమవుతుందో తెలుసా?: చంద్రబాబు

మద్యం దోపిడితో మనుషుల రక్తాలను పీల్చుతున్నారని చెప్పారు.

జగన్ మళ్లీ జైలుకి వెళ్తే ఏమవుతుందో తెలుసా?: చంద్రబాబు

Chandrababu Naidu

Updated On : February 5, 2024 / 5:40 PM IST

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అర్జునుడు కాదని, అక్రమార్జునుడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఏపీలో మళ్లీ వెలుగులు నింపే శక్తి మనకు ఉందని చెప్పారు. చంద్రబాబు సోమవారం అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మాడుగుల, ఏలూరు పార్లమెంట్ చింతలపూడిలలో రా కదలి రా సభల్లో పాల్గొన్నారు.

మాడుగులలో ఆయన మాట్లాడుతూ జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ మళ్లీ జైలుకి వెళ్తే అప్పులన్నీ రాష్ట్ర ప్రజలే కట్టాల్సి వస్తుందని అన్నారు. మద్యం దోపిడితో మనుషుల రక్తాలను పీల్చుతున్నారని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఇంతటి అక్రమార్జునుడిని చూడలేదని అన్నారు.

కలియుగంలో జగన్ బకాసురుడు మొత్తం మింగేస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో ప్రజల సంపద ఆవిరి అయిందని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 64 రోజుల్లో జగన్ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని,  రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.

Harish Rao: సీఎం రేవంత్‌ రెడ్డికి మరోసారి కౌంటర్‌ ఇచ్చిన హరీశ్ రావు