టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హితబోధ.. వన్ టైమ్ ఎమ్మెల్యేగా మిగిలిపోతామంటే మీ ఇష్టమంటూ..
వారి పనితీరు, ప్రవర్తనలో మార్పు రాకపోతే టికెట్లు కోత పెట్టేందుకు వెనకాడరని అంటున్నారు.

CM Chandrababu Naidu
“ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా..మీ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలన్నా..పద్దతి మార్చుకోండి. పనితీరులో వేగం పెంచండి” ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న తీరు ఇది. ఏడాది పాలన సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు..వారికి దిశానిర్ధేశం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండండి. ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించండి. అన్నింటికి మించి మీ ప్రవర్తన మార్చుకోండని అంటూ కొందరు ఎమ్మెల్యేలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారట సీఎం చంద్రబాబు.
ప్రజలు ప్రతీది గమనిస్తారన్న విషయం మార్చిపోవద్దని అలర్ట్ చేశారట. ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పా..మళ్లీ మళ్లీ చెప్తున్నా పనితీరులో ప్రవర్తనలో మార్పు రాకపోతే మిమ్మల్ని మోయడానికి పార్టీ సిద్ధంగా లేదని క్లియర్ కట్‌గా చెప్పేశారట చంద్రబాబు. వన్ టైమ్ ఎమ్మెల్యేలగా మిలిగిపోతామంటే మీ ఇష్టం అంటూ కూడా కామెంట్ చేశారట. ప్రతి ఎమ్మెల్యే పనితీరు, ప్రవర్తన, వ్యవహారశైలిపై తన దగ్గర రిపోర్ట్ ఉందని..పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారంటున్నారు.
ఏడాది పాలన సందర్భంగా అన్నీ సమీక్షించుకుంటున్న సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వం మీద ప్రజలు సంతృప్తిగా ఉన్నారని భావిస్తున్నారట. కానీ అక్కడక్కడ ఎమ్మెల్యేల తీరుపై ప్రజలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు బాబు దృష్టికి వచ్చిందంటున్నారు. అందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలతో టెలీఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ.. మరోసారి వార్నింగ్ ఇచ్చారట. మంత్రులు రెగ్యులర్‌గా క్యాబినెట్ భేటీలో కలుస్తుంటారు.
సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలి: చంద్రబాబు
అందుకే ఎమ్మెల్యేలతో స్పెషల్‌గా మాట్లాడి పార్టీ లక్ష్యమేంటి? ప్రభుత్వం పేదల కోసం ఏం చేస్తుందో వివరించాట. త్వరలో ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలు..ఇప్పటికే అమలు ఇంప్లిమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించాలని సూచించారట. త్వరలో ప్రతీ ఎమ్మెల్యేలతో వన్ టు వన్ భేటీ అవుతానని చెప్పారట బాబు.
ఎంత చెప్పినా మారకపోతే..ఎమ్మెల్యేలు గాడి తప్పితే వదులుకోవడానికి కూడా సిద్ధమని హెచ్చరించారట. ఈ ఏడాది కాలంలో టీడీపీకి చెందిన 134 మంది ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని ఇప్పటికే ఓ రిపోర్ట్ తెప్పించుకున్నారట సీఎం చంద్రబాబు. ఇందులో కొందరు శాసనసభ్యులపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందంటున్నారు. ప్రభుత్వం బానే ఉందంటున్న పబ్లిక్..ఎమ్మెల్యేలే తీరుపైనే ఆశించినట్లుగా లేదని చెబుతున్నారట.
చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం..విశ్వాసం ఉందని ప్రభుత్వానికి సమాచారం ఉందట. ఎమ్మెల్యేలపై ప్రజలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలిసిందట. ప్రజలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండాల్సిన ఎమ్మెల్యేలు పట్టణాలు, నగరాల్లో ఆఫీస్‌లు పెట్టి అప్పుడప్పుడు వచ్చి పోతున్నారట. అందుకే సీఎం చంద్రబాబు పదే పదే అలర్ట్ చేస్తూ వస్తున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. కూటమిగా వెళ్లినా సొంతంగా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ గెలిసి వస్తేనే..ఇప్పటి లాగా బలమైన ప్రభుత్వం ఉంటుందని భావిస్తున్నారట చంద్రబాబు.
ఈ క్రమంలో ఎమ్మెల్యేల తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నారు చంద్రబాబు. అయినా వారి పనితీరు, ప్రవర్తనలో మార్పు రాకపోతే టికెట్లు కోత పెట్టేందుకు వెనకాడరని అంటున్నారు. తనతో సహా ఎవరైనా పార్టీ, ప్రజల మేలు కోరే పనిచేయాలని..అలా వర్క్ చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారని ఈ విషయం గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారట. ముఖాముఖి సమావేశాలు నిర్వహించి ఏ ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు. సదరు నేత చేస్తున్న దందాలు ఏంటి..ఆయన మీదున్న ఆరోపణలేంటి.? అన్ని వివరాలు ముందు పెట్టనున్నారట.